Akhanda 2: అందుకే కుంభమేళాలో షూటింగ్ ప్లాన్ చేశాం - 'అఖండ 2'పై డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు
Akanda 2 Shooting in Kumbha Mela: మహా కుంభమేళా అఖండ 2 షూటింగ్ జరిపించడంపై దర్శకుడు బోయపాటి శ్రీను ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుతో అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Boyapati Srinu About Maha Kumbha Mela: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2 తాండవం’. 2021 విడుదలైన ‘అఖండ‘ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నార్త్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అఘోర నేపథ్యంలో ‘అఖండ 2‘ సాగనుంది. అందుకే కుంభమేళలో ‘అఖండ 2‘ కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ మహా కుంభమేళాలో ‘అఖండ 2‘ టీం సందడి చేయడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడారు.
‘‘మహా కుంభమేళా ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ‘అఖండ 2‘ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. ఈ సినిమా అఘోరా నేపథ్యంలో సాగే కథ అని తెలిసిందే. సినిమాలోని కొన్ని సీన్స్ కోసం కుంభమేళాలో షూటింగ్ చేసేందుకు ఇక్కడికి వచ్చాం. జనవరి 11 నుంచి మూవీ టీం అంతా ఇక్కడే ఉంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడకు వస్తున్న నాగసాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపంగా ‘అఖండ 2‘ సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఈ రోజుతో ఇక్కడ షూటింగ్ పూర్తి అవుతుంది. మాది అఘోర చిత్రం కావడంతో కుంభమేళాలో షూటింగ్ జరిపించడం, ఈ సందర్భంగా ఇక్కడ నాగసాధువులను, అఘోరలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కోట్ల మంది భక్తులు, అఘోరాలు, సాధువుల మధ్య ‘అఖండ 2‘ షూటింగ్ జరగడం విశేషంగా బావిస్తున్నాం’‘ అని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.
2021లో విడుదలైన ‘అఖండ‘ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు పెద్ద హిట్స్ లేని బాలయ్యకు ‘అఖండ‘ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. దీంతో ‘అఖండ 2‘పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి కూడా మరింత కేర్ తీసుకుంటున్నారు. ‘అఖండ‘కు థీటుగా భారీ యాక్షన్, బలమైన కథ, కథనంలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ లో ‘అఖండ 2‘ని విడుదల చేసేందుకు మూవీ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ని చకచక పూర్తి చేసే పనిలో డైరెక్టర్ నిమగ్నమై ఉన్నారు. కాగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య ‘డాకు మహారాజ్‘ అంటూ వైల్డ్ యాక్షన్ తో ఈ సంక్రాంతి బరిలో దిగారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్స్ చేస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.
Also Read: సైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నది తీరాన జరిగే ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారిగి జరిగే ఈ ప్రత్యేక మహా కుంభమేళాకు దేశ విదేశాలను నుంచి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు, 14 అఖాడాలకు చెందిన లక్షలాది మంది సాధువుల వచ్చి పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు కోట్లమంది భక్తులు హాజరైన నది తీరాన స్నానం ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ నదీ తీరం భక్తులతో జనసంద్రంగా మారింది.
Also Read: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?





















