అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajinikanth: రజినీకాంత్, అనిరుధ్ మధ్య ఉన్న 'బంధుత్వం' ఏంటో తెలుసా?

రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అయితే రజనీ- అనిరుధ్‌ మధ్య బంధుత్వం ఉందనే సంగతి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా 'జైలర్' మ్యానియా కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తున్నారు. యావరేజ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. మరోవైపు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన 'కావాలయ్యా', 'హుకుం' సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక తలైవా స్టైల్ కు తగ్గట్టుగా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అనిరుధ్ అందించిన బీజీఎం ఫ్యాన్స్ కు గూస్‌ బమ్స్‌ తెప్పిస్తోంది. ఇతర హీరోల అభిమానులు సైతం ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వీడియోలను ఎడిట్ చేసుకుంటున్నారంటే, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్ లో సాంగ్స్ & బీజీఎమ్ కీలక పాత్ర పోషించాయని అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రజినీ - అనిరుధ్ లకు సంబంధించిన టాపిక్స్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇందులో భాగంగా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఇటీవల 'జైలర్' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో అనిరుధ్ రవిచందర్ ను రజనీ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఈ క్రమంలో అనిరుధ్‌ ఇచ్చిన స్టేజ్‌ ఫర్మామెన్స్‌ యూట్యూబ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. 'హుకుం' పాటకు అతను స్టేజీ మీద ఊగిపోతూ డ్యాన్స్ చేయడం అభిమానులతో పాటుగా తలైవాని కూడా మెప్పించింది. రజనీ కోసం అలాంటి పర్‌ఫార్మన్స్‌ చేయడంతో సంగీత దర్శకుడు ఆయనకు వీరాభిమాని అని అందరూ భావించారు. అయితే వారి మధ్య అంతకుమించి బంధుత్వం ఉందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. 

అనిరుధ్ రవిచందర్ తమిళ యాక్టర్ రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయనకు రజనీకాంత్‌ తో చాలా దగ్గరి బంధుత్వం ఉంది. రాఘవేంద్ర ఎవరో కాదు, రజనీ సతీమణి లతాకి సొంత తమ్ముడు. అంటే అనిరుధ్ ఆమెకి మేనల్లుడు అవుతాడు. తన కళ్ళ ముందే పెరిగి పెద్దయిన అనిరుధ్ అంటే రజినీకి ప్రత్యేక అభిమానం. అనిరుధ్ ను ఎత్తుకొని ముద్దు చేస్తున్న ఫోటోలు, పలు సందర్భాల్లో ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. గతంలో రజినీకాంత్ నటించిన 'పేట', 'దర్బార్' చిత్రాలకు అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలు ఆశించిన విజయాలు సాధించినప్పటికీ, మ్యూజిక్ పరంగా అలరించాయి.  

Also Read: 'లవ్ గురు' గా మారిన బిచ్చగాడిని చూశారా?

2012లో ధనుష్‌ హీరోగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన '3' సినిమాతో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. అప్పుడు అతని వయస్సు 21 ఏళ్లు మాత్రమే. ఈ మూవీ కోసం కంపోజ్ చేసిన 'వై థిస్ కోలవెరిడి' సాంగ్ అప్పట్లో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి బ్యాక్ టూ బ్యాక్ సినిమాకు వర్క్ చేస్తూ బిజీ కంపోజర్ గా మారిపోయాడు. సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్‌ అదరగొడతాడనే పేరు తెచ్చుకున్నాడు. 

పవన్ కళ్యాణ్ సిల్వర్ జూబ్లీ సినిమా 'అజ్ఞాతవాసి' తో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. పాటలు బాగున్నా ఆ మూవీ డిజాస్టర్ అవ్వడంతో, ఆ ఎఫెక్ట్ అందరితో పాటుగా అనిరుధ్ పై కూడా పడింది. 'అరవింద సమేత' సినిమాకి సంగీతం అందించే అవకాశం వచ్చినట్లే వచ్చి దూరమైంది. ఆ తర్వాత నాని 'గ్యాంగ్ లీడర్' 'జెర్సీ' సినిమాలకు అద్భుతమైన పాటలు సమకూర్చినా.. టాలీవుడ్ లో అతని కెరీర్ ఊపందుకోలేదు. తెలుగు డబ్బింగ్ చిత్రాలు మాత్రం సక్సెస్ అందించాయి. 'మాస్' 'ఆవేశం' 'నేను రౌడీనే' 'నవ మన్మథుడు' 'రెమో' 'వివేకం' 'పేట' 'మాస్టర్' 'బీస్ట్' 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' 'తిరు' వంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

అనిరుధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలానే విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కలయికలో రానున్న VD12 మూవీకి కూడా అతనే సంగీత దర్శకుడు. ఇవి కాకుండా 'జవాన్' 'లియో' 'ఇండియన్ 2' సినిమాకు వర్క్ చేస్తున్నాడు. 'జైలర్' తర్వాత రజినీ కాంత్ చేయబోయే రెండు చిత్రాలకు అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్ అని టాక్ నడుస్తోంది. 

Read Also:  'మన్మథుడు' మళ్ళీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Embed widget