అన్వేషించండి

Dhurandhar: ఆర్ఆర్ఆర్ రూటులో ధురంధర్... మళ్ళీ రణబీర్ & ఆదిత్య ధర్ ఆ తప్పు చేస్తారా?

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బాద్షా రాజమౌళి. సినిమా విడుదలకు ముందు మాత్రమే కాదు... విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ పరంగా ట్రెండ్ సెట్ చేశారు. ఆయన రూటులో ధురంధర్ వెళతాడా? ఆయన చేసిన ఓ మిస్టేక్ రిపీట్ చేశారా?

ఎవరు ఔనన్నా కాదన్నా భారతీయ సినిమా బాక్సాఫీస్ బాహుబలి, బాద్షా మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడమే కాదు... పాన్ వరల్డ్ ప్రమోషన్స్ ఎలా చేయాలో చూపించారు. అదీ సినిమా విడుదలకు ముందు మాత్రమే కాదు... సినిమా విడుదల తర్వాత కూడా ఎలా ప్రమోట్ చేయవచ్చో చూపించారు. ఇప్పుడు రాజమౌళి చూపించిన రూటులో వెళ్ళడానికి 'ధురంధర్' టీం రెడీ అవుతోంది. అయితే, రాజమౌళి చేసిన తప్పును వాళ్ళూ రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.

థియేటర్లలోకి 'ధురంధర్' డాక్యుమెంటరీ!
పాన్ ఇండియా హిట్స్ అంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వస్తున్నాయని, నార్త్ ఫిల్మ్ మేకర్స్ ఆ తరహా సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్నారని ఇంటా బయట విమర్శలు వచ్చిన తరుణంలో 'ధురంధర్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా మేకింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also Read: Balakrishna: అబ్బాయితో 'దేవర 2' కంటే ముందు... బాబాయి బాలకృష్ణతో!

'ధురంధర్' కోసం బ్యాంకాక్‌లో భారీ సెట్ వేశారు. సుమారు ఐదారు ఎకరాలలో మన దాయాది దేశం పాకిస్తాన్‌లోని కరాచీ, లేయారిని తలపించే సెట్ వేశారు. అది చూసి నిజంగా పాకిస్తాన్ అని ప్రేక్షకులు నమ్మరంటే అతిశయోక్తి కాదు. అలాగే, రెండు భాగాలు తీయడానికి అయిన బడ్జెట్ చూసి కూడా జనాలు నోరెళ్లబెట్టారు. అసలు ఈ సినిమా ఎలా తీశారని ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ మీద ఒక డాక్యుమెంటరీ రెడీ చేస్తున్నారు ఆదిత్య ధర్. ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తారని చెప్పవచ్చు. అయితే... ఆ డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేయడమే 'ఆర్ఆర్ఆర్' టీం చేసిన తప్పును గుర్తు చేస్తోంది. 

Also Read: Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' భారీ బాక్స్ ఆఫీస్ విజయం సాధించింది. ఆ సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. సినిమా మేకింగ్ మీద రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. దానిని థియేటర్లలో విడుదల చేశారు. సినిమా వచ్చిన స్పందన కాదు కదా కనీసం సాధారణ సినిమా స్థాయిలో కూడా స్పందన రాలేదు. కళ్ళముందు ఆ ఉదాహరణ ఉంచుకుని మరీ 'ధురంధర్' టీం ఆ తప్పు చేస్తుందా? వెయిట్ అండ్ సి. థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే డాక్యుమెంటరీ విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్
Bhogi Public Review : భోగి పబ్లిక్ రివ్యూ : శర్వా మాస్ యాక్షన్ ఎలా ఉంది?... వయలెన్స్ మరీ ఎక్కువైందా?
భోగి పబ్లిక్ రివ్యూ : శర్వా మాస్ యాక్షన్ ఎలా ఉంది?... వయలెన్స్ మరీ ఎక్కువైందా?
Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget