Dhanush - Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది - ధనుష్
Kuberaa Pre Release Event: తెలుగులో తనకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని పలు కార్యక్రమాలలో ధనుష్ చెప్పారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పవన్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పారు.

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)కు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. మరి ధనుష్‌కు మన తెలుగులో ఇష్టమైన హీరో ఎవరో తెలుసుగా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... తన ఫేవరెట్ అని పలు కార్యక్రమాలలో ధనుష్ చెప్పారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి... తన అభిమాన తెలుగు హీరోతో దర్శకుడిగా సినిమా చేయాలని ఉందని చెప్పారు.
ఒకవేళ తెలుగులో డైరెక్ట్ చేస్తే...
ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ (Kuberaa Pre Release Event) ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో జరిగింది. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున మరొక హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఈ వేడుకలో సుమ నుంచి ధనుష్‌కు ఒక ప్రశ్న ఎదురయింది.
''మీరు తమిళంలో దర్శకుడుగా సినిమాలు చేశారు. ఒకవేళ తెలుగులో డైరెక్ట్ చేయాల్సి వస్తే... ఏ హీరోని డైరెక్ట్ చేయాలని అనుకుంటారు?' అని సుమ ఓ ప్రశ్న వేశారు. ఏమాత్రం తడుముకోకుండా ఎటువంటి సందేహం లేకుండా ''పవన్ కళ్యాణ్ సార్'' అని ధనుష్ చెప్పారు. అది సంగతి.
#Dhanush would like to direct #PawanKalyan in Telugu film!#Kuberaa #KuberaaPreReleaseEvent pic.twitter.com/XLyBXK3w79
— ABP Desam (@ABPDesam) June 15, 2025
I want to direct #PawanKalyan garu in Telugu 🔥
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 15, 2025
- #Dhanush at #Kuberaa Pre release
pic.twitter.com/82gIm5XzMK
" You earn 150 rupees you will have problem for 400 rupees. You earn 1 crore and you will have problem for 2 crore."
— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025
- #Dhanush | #Kubera pic.twitter.com/393n4Ad3Ln
దర్శకుడిగా తమిళంలో సినిమాలు చేశారు ధనుష్. ఆయన ఓ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాయన్' తెలుగులోనూ విజయం సాధించింది. మేనల్లుడు హీరోగా ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం 'ఇడ్లీ కడై' సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ధనుష్ హీరోగా నటించిన రెండో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమిది. దానికి ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా చేశారు అది 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.





















