Dhandoraa Review : 'దండోరా' సెన్సార్ రివ్యూ - 15 మార్పులు సూచించిన బోర్డు... ఆ సీన్స్, డైలాగ్స్ కట్
Dhandora Censor Review : 'దండోరా' గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ జారీ చేసిన బోర్డు 15 మార్పులు సూచించింది.

Dhandoraa Movie First Review : సీనియర్ హీరో శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ ఓరియెంటెడ్ డ్రామా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి కాగా... UA సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 16 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారు.
సెన్సార్ బోర్డు. గ్రామీణ నేపథ్యం, సమాజంలో అసమానతలు, 'కులం' అనే సెన్సిటివ్ అంశం ఆధారంగా మూవీ తెరకెక్కించినందున కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
'దండోరా' డిలీటెడ్ సీన్స్ ఏవంటే?
'దండోరా' సినిమాలో 15 మార్పులు సూచించింది బోర్డు. కొన్ని సీన్స్, అసభ్యకర పదాలను తొలగించాలని ఆదేశించింది. సినిమా ప్రారంభంలో ఈ సినిమా కల్పితమని, పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగిందని ఓ డిస్‌క్లైమర్ యాడ్ చేయాలని సూచించింది. అక్కడక్కడ వచ్చే ఇంటి పేర్లు తొలగించాలని తెలిపింది. చుండూరు/కారంచేడు వంటి గ్రామాల పేర్లు తొలగించడం సహా 'లింగ మార్పిడి చేయం', 'కులం' తర్వాత వచ్చే కొన్ని సంభాషణలు తొలగించాలని ఆదేశించింది.
బాస్టర్డ్, వేశ్య, ఉచ్ఛ, సాంక్, లం**** అనే పదాలను తొలగించాలని సెన్సార్ బోర్డు తెలిపింది.. మ్యూట్ చేయబడింది. అలాగే, మృతదేహంపై మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలను తొలగించాలని, ధూమపానంపై చట్టబద్ధమైన వార్నింగ్స్ యాడ్ చేయాలంటూ సూచనలు చేసింది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు మూవీ టీం కొన్ని సీన్స్ బ్లర్ చేయడంతో పాటు చెప్పిన డైలాగ్స్ తొలగించింది. అవసరమైన చోట మ్యూట్ చేసింది.
Also Read : నా బిడ్డను చంపలేక చావే చచ్చిపోయింది - షాకింగ్ లుక్‌లో రష్మిక... 'మైసా' ఫస్ట్ గ్లింప్స్
ఈ మూవీలో శివాజీ, నవదీప్, బిందు మాధవిలతో పాటు మౌనికా రెడ్డి, రవికృష్ణ, అనూష, మనికా చిక్కాల, రాద్యా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అదితి భావరాజు కీలక పాత్ర పోషించారు. కలర్ ఫోటో, బెదురులంక 2021 మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్రా బెనర్జీ దండోరాను నిర్మించారు.






















