Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
నటి దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. నటి దీపికా పదుకొనే రెండోసారి గర్బం ధరించినట్లు ప్రకటించి కుటుంబసభ్యులు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే వీరికి ఓ కుమార్తె ఉండగా.. నటి దీపికా పదుకొనే మరోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించారు. దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తన ఫాలోవర్స్, అభిమానులతో షేర్ చేసుకుంది. మరోసారి గర్భం దాల్చినట్లు షేర్ చేసిన పోస్టులో కుమార్తె దువా కనిపిస్తుంది.
గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనె
దీపికా, రణవీర్‌ల ముద్దుల తనయ దువా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను దీపిక షేర్ చేసింది. ఆ ఫొటోలో రణవీర్ సింగ్, దీపికా చేతులు కనిపిస్తున్నాయి. ముగ్గురు ఇప్పుడు నలుగురు కాబోతున్నామనే శుభవార్తను బాలీవుడ్ కపుల్ తమ అభిమానులతో పంచుకుంది. దీపికా చేసిన ఈ పోస్ట్‌పై అటు సెలబ్రిటీలు, ఇటు ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. రణవీర్, దీపికకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
హీరోయిన్లు పరిణీతి చోప్రా, సమంత, అనన్యా పాండే, కరీనా కపూర్.. రణవీర్, దీపిక జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నటి భూమి పెడ్నేకర్, అనితా హసానందాని, సునీల్ గ్రోవర్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ బాలీవుడ్ కపుల్‌కు కంగ్రాట్స్ అని విషెస్ చెబుతున్నారు.
కొంతకాలం ప్రేమించుకున్న వీరు నవంబర్ 14, 2018న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెస్టింగ్‌కు ఇరుకుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారు కొంకణి, సింధీ ఆచారాలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు.
దీపికా సెప్టెంబర్ 8, 2024న తొలి సంతానం దువాకు జన్మనిచ్చింది. ఆ తరువాత కొన్ని రోజులకు దువా ఫేస్ రివీల్ చేశారు. ఇందులో దువా రెడ్ కలర్ సూట్‌లో కనిపించింది. తాజాగా దీపికా మరోసారి గర్భం ధరించడంతో ఈ బాలీవుడ్ కపుల్ మరోసారి తల్లిదండ్రులు అవుతున్నారు. మరోవైపు ఈ జంట సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















