Deepika Padukone: దీపికా పదుకొనే ఒక సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Deepika Padukone: దీపికా పదుకొనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Highest-Paid Actresses in Bollywood: దీపికా పదుకొనే 2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం దీపికా రెమ్యునరేషన్ తీసుకోలేదు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించడమే తనకు ఫీజు అని దీపికా భావించింది. ఈ సినిమా తర్వాత దీపికా దశ తిరిగింది. సింగిల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు రెండు దశాబ్ధాలకు చేరువ అవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. దీపికా పదుకొనే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
దీపికా పదుకొనే ఎంత ఫీజు తీసుకుంటారు?
నివేదికల ప్రకారం, దీపికా పదుకొనే 15-30 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. రీసెంట్ గా షారుక్ ఖాన్ తో కలసి నటించిన 'పఠాన్' సినిమా కోసం ... ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం దీపికా 15 కోట్ల ఫీజు తీసుకుంది. ఈ సినిమాలో దీపికా యాక్షన్ అవతార్‌లో కనిపించింది.
అజయ్ దేవగన్, కరీనా కపూర్ నటించిన సినిమాలో దీపికా శక్తి శెట్టి పాత్ర పోషించింది. నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఆమె 6 కోట్లు పారితోషికం తీసుకుంది. దీనితో పాటు ఫైటర్ సినిమా కోసం దీపికా 20 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. దీనితో పాటు గెహ్రాయియాన్ సినిమా కోసం ఆమె 20 కోట్ల రూపాయలు తీసుకుందని తెలుస్తోంది.
View this post on Instagram
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, దీపికా నికర ఆస్తి 500 కోట్లు.
కల్కి 2898 AD రెండవ భాగానికి సంబంధించి వివాదం
దీపికా పదుకొనే కల్కి 2898 AD గురించి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సినిమా నుంచి దీపికాను తొలగించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీపికాను తొలగించినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీపికా 7 గంటల పని షిఫ్ట్ కోరుకుంటున్నారని ...తన రెమ్యునరేషన్ పెంచాలని కూడా కోరిందని...అందుకే నిర్మాతలు ఆమెను సినిమా నుంచి తొలగించారనే డిస్కషన్ జరుగుతోంది.
అంతకుముందు సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్‌కు సంబంధించి కూడా వివాదం చెలరేగింది. స్పిరిట్ నుంచి కూడా దీపికాను తొలగించారు. 8 గంటల షిఫ్ట్, రెమ్యునరేషన్ పెంపు, సినిమా లాభాల్లో వాటా డిమాండ్ల కారణంగా దీపికాను సినిమా నుంచి తొలగించారు. సినిమా కథ కూడా ఆమె లీక్ చేసిందంటూ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం దీపిక అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో వస్తోన్న పాన్ వరల్డ్ మూవీలో భాగమైంది. ఈ సినిమాతో హిట్ అందుకుంటే ఇంకొన్నాళ్లు దీపిక ఎలాంటి డిమాండ్స్ పెట్టినా ఇండస్ట్రీలో వెలగడం ఖాయం...






















