Dasara Box Office: ఏపీలో వెనకబడ్డ నాని ‘దసరా’, ఆ ప్రాంతాల్లో మరీ ఘోరం?
‘దసరా’ సినిమా నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అయితే కొన్ని చోట్ల ఇంకా ‘దసరా’ హవా కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల డౌన్ అయింది.
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటించిన సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30 న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా దసరాను రిలీజ్ చేశారు. కథ, కథనంలో కొత్తదనం అలాగే యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అవ్వడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాగే విడుదలైన వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. అయితే కొన్ని చోట్ల ఇంకా ‘దసరా’ హవా కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల డౌన్ అయింది. నైైజాం ఏరియాలో సినిమా మంచి వసూళ్లను కొనసాగిస్తుంటే.. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో హవా తగ్గినట్టే కనబడుతోంది.
ఇక లెక్కల్లోకి వెళితే.. సోమ, మంగళవారాల్లో వరుసగా నైజాంలో 1.22 కోట్ల షేర్ & 1.05 కోట్ల షేర్ వసూలు చేయగా, ఏపీలో 0.77 కోట్లు, 0.62 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తం APలో 20.5 కోట్లకు అమ్ముడైంది, అందులో ఆంధ్ర ప్రాంతం (UA, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు) 14 కోట్లు & సీడెడ్ కి 6.5 కోట్లు. 14 కోట్ల విలువైన హక్కులకు 6 రోజులకు గానూ ఆంధ్రా రీజియన్ షేర్ 11.7 కోట్లు గా ఉంది. ఇంకా ఏపీ లో వెస్ట్, కృష్ణా, గుంటూరు వంటి ఇతర ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ కోసం కొంతమేర వసూళ్లు రాబట్టాల్సి ఉంది. నైజాం ప్రాంతాలతో పోలీస్తే ఏపీలోని సీడెడ్ ఏరియాలలో ‘దసరా’ హవా కాస్త తగ్గిందని తెలుస్తోంది. మరి ఈ వారాంతంలో సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమాకు ప్రాంతీయ అంశం బాగా దోహదపడుతుందనే చెప్పాలి. అందుకే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమాకు ఇంకా ఆధరణ తగ్గలేదనే చెప్పాలి. సినిమా మొత్తం తెలంగాణ యాసతో సాగుతుండటం సక్సెస్ కు బాగా కలసివచ్చింది. గతంలో ‘బలగం’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలంగాణ సాంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో సాగుతుంది. దీంతో తెలంగాణలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు ‘దసరా’ కూడా నైజాం ప్రాంతంలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ ఏపీలో కొద్దిగా వెనకబడింది. ఇంకా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ను టార్గెట్ ను రీచ్ అవ్వాల్సి ఉంది. అప్పుడే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ వీకెండ్ లో రవితేజ ‘రావణాసుర’, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ వంటి సినిమాలు రీలీజ్ అవ్వడంతో వాటి ప్రభావం ‘దసరా’ పై ఎంతమేరకు ఉంటుందో చూడాలి.
Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?