By: ABP Desam | Updated at : 28 Jul 2023 09:46 PM (IST)
Photo Credit: Sekhar Kammula/Instagram
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈరోజు తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక బర్త్ డే సందర్భంగా ధనుష్ నెక్స్ట్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది 'సార్' అనే తెలుగు స్ట్రెయిట్ ఫిలిం చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ధనుష్ తెలుగులో తను నెక్స్ట్ మూవీని క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ కెరియర్ లో 51వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాని నారాయణదాస్ కే నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
తాజాగా ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ధనుష్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించబోతున్నారట. కాగా సినిమాకి సంబంధించిన ఇతర వివరాలేవి బయటికి రాకపోగా, సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లో ఓ పక్క స్లమ్ ఏరియా కనిపిస్తోంది. మధ్యలో డబ్బు నోట్లు ఉండగా, పక్కనే అనేక అంతస్తుల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ కాన్సెప్ట్ పోస్టర్ను చూస్తుంటే ఈసారి శేఖర్ కమ్ముల ఓ డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. పేదవారు, ధనవంతుల మధ్య అవకతవకలను చూపించేలా శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ఈ సినిమాని ప్లాన్ చేసినట్లు పోస్టర్ చూస్తే స్పష్టమవుతుంది.
మొత్తం మీద కాన్సెప్ట్ పోస్టర్ తోనే ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు మూవీ టీం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ కాన్సెప్ట్ పోస్టర్ కి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ధనుష్ హీరోగా తమిళంలో 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమా తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితమే సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అయితే తాజాగా ధనుష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ధనుష్ మరోసారి ఈ టీజర్ లో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా టీజర్ లో ధనుష్ లుక్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అరుణ్ మాథెశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, నివేదిత సతీష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి అటు బాలీవుడ్ లోనూ ఆనంద్ ఎల్ రాయి దర్శకత్వంలో 'తేరే ఇష్క్ మే' అనే సినిమా చేస్తున్నారు ధనుష్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రాంజనా', 'అతరంగిరే' వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. కాగా ఇటీవల 'రాంజానా' సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన 'రాంజనా' సినిమాకి ఇది సీక్వెల్ రూపొందుతోంది. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>