Sankranti Releases 2024: సంక్రాంతి రేస్ నుంచి ఆ రెండు సినిమాలు ఔట్ - కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు, కారణం అదేనట!
Ayalaan : టాలీవుడ్ లో ఈ సంక్రాంతి బరి నుంచి శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలు తప్పుకున్నట్లు సమాచారం.
Captain Miller and Ayalaan Telugu release : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. 2024 సంక్రాంతి బరిలో ఐదు సినిమాల నిలవగా అందులో నిర్మాతలు కూలంకషంగా చర్చించి రవితేజ 'ఈగల్' సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. దాంతో ప్రస్తుతం సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ, నా సామిరంగ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నాలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం కష్టమంటే ఇప్పుడు ఈ మధ్యలో ఓ తమిళ సినిమా కూడా వచ్చి చేరింది. నిజానికి ప్రతి ఏడాది తెలుగు సినిమాలతో పాటు ఒకటి, రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.
అలా గత ఏడాది చూసుకుంటే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మధ్యలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' రిలీజ్ అయింది. ఈసారి పొంగల్ బరిలో తమిళంలో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. మామూలుగా తమిళ్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చేసి తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తికేయన్ ‘అయలాన్’ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ సంక్రాంతికి తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ఉద్దేశంతో ధనుష్ పొంగల్ బరి నుంచి తప్పుకున్నాడు.
ఇక శివ కార్తికేయడానికి మాత్రం ఖచ్చితంగా జనవరి 12న తెలుగులో రిలీజ్ చేస్తారని అన్నారు ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర హక్కుల్ని నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేయడంతో తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఖచ్చితంగా ఉందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాని కూడా వాయిదా వేసినట్లు దిల్ రాజు స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకు కారణం సరిపడా థియేటర్స్ లేకపోవడమే అని తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ రెండు సినిమాలను జనవరి 19 లేదా 26 న తెలుగులో రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా తమిళంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతోంది. తమిళనాట సంక్రాంతికే ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
కాబట్టి వీటికి పాజిటివ్ వస్తే కచ్చితంగా వారం లేదా రెండు వారాల గ్యాప్ లో తెలుగులో రిలీజ్ చేస్తారు. అదే టాక్ కాస్త తేడా కొట్టినా తెలుగు వెర్షన్ పై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇక శివ కార్తికేయన్ 'అయలాన్' విషయానికి వస్తే.. రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కేల్కర్, ఈషా కొపికర్, భానుప్రియ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇక ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ప్రియాంక అరుల్ మోహన్ నటించిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Also Read : 'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు - మ మ మహేష్ మాస్