OG Update : 'ఓజీ' అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్... పవన్ - సుజీత్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్
OG : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ. తాజాగా ఈ సినిమాలో ఇంటర్నేషనల్ నటులు భాగం కాబోతున్నారనే అప్డేట్ ను షేర్ చేసుకున్నారు సినిమాటోగ్రాఫర్ రవి కే శంకర్.
Pawan Kalyan OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఓజి' సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ ను చూశాక 'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన 'నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్' అనే డైలాగ్ గుర్తురాక మానదు. ఎందుకంటే ఈ సినిమాలో ఇంటర్నేషనల్ నటులు భాగం కాబోతున్నారు అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నేషనల్ కాదు ఇంటర్నేషనల్ నటులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆయన 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' అనే సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ ఓ ఇంటర్వ్యూలో 'ఓజి' సినిమాలో జపాన్, కొరియన్ నటీనటులు నటించబోతున్నారు అని చెప్పి అంచనాలను పెంచేశారు. తాజాగా 'ఓజీ ' సినిమాకు డిఓపిగా పని చేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ క్రేజీ అప్డేట్ ని షేర్ చేసుకున్నారు.
ప్రముఖ థాయిలాండ్ యాక్టర్ Vithaya Pansringarm 'ఓజి' సినిమాలో నటించబోతున్నారనే విషయాన్ని రవిశంకర్ వెల్లడించారు. ఆయన 'ఓన్లీ గాడ్ ఫర్ గివ్స్' అనే పాపులర్ సినిమాలో నటించారు. అలాగే మరో ప్రముఖ జపాన్ నటుడిని కూడా రవి శంకర్ పరిచయం చేశారు. మొత్తానికి ఈ అప్డేట్స్ చూశాక మెగా అభిమానులు 'ఓజి' అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అంటూ మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.
OG #TheyCallHimOG Thailand shooting 🔥🏌🏻♂️ pic.twitter.com/nTP79nhOCf
— SENANI Followers (@SenaniFollowers) December 8, 2024
థాయిలాండ్ లో షూటింగ్
పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా 'హరిహర వీరమల్లు', 'ఓజి' సినిమాల షూటింగ్లను మధ్యలోనే వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం మెగా అభిమానులకు బోనస్ ఫీస్ట్. మొత్తానికి చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను తెరపై మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు డైరెక్టర్ సుజీత్... జపాన్ థాయిలాండ్ పాపులర్ యాక్టర్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, అకిరా నందన్ ఎంట్రీతో 'ఓజి' సినిమా ద్వారా మంచి విందు భోజనం పెట్టబోతున్నాడని అనిపిస్తోంది. ప్రస్తుతం 'ఓజీ' మూవీ షూటింగ్ థాయ్‌లాండ్‌లోనే జరుగుతోంది. భారీ నౌక, ఎయిర్‌పోర్ట్, లగ్జరీ కార్లు ఉపయోగించి థాయిలాండ్ లొకేషన్లలో చిత్రంబృందం షూట్ జరుపుతుండగా, వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.