సలార్ సినిమాలో రాధారమగా ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది శ్రియా రెడ్డి. శృతి హాసన్ కంటే శ్రియా చేసిన పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకునేలా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు ఎంతపేరు వచ్చిందో.. జ్యువెలరీకి అంతే చర్చ జరిగింది. ఆమె ధరించిన బ్లాక్ మెటల్ జ్యూవెలరీ ఫ్యాషన్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇయర్ రింగ్స్ మునుపెన్నడూ లేని విధంగా రూపొందించారు. దాదాపు భుజం వరకు వేలాడేలా పెద్ద, ఆకర్షణీమైన ఇయర్ రింగ్స్‌ను డిజైన్ చేశారు. మిగిలిన జ్యూవెలరీకి సెట్ అయ్యేలా ఇయర్ రింగ్స్‌ను డిజైన్ చేయించినట్లు చిత్రబృందం తెలిపింది. రాధారమా లుక్‌లో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించాయి.