జపనీస్ వాటర్ థెరపీతో అనారోగ్యాలు హంఫట్, ఇలా చెయ్యండి జపనీస్ కూడా ఇదే పాటిస్తారు. అయితే, వారికి ఒక పద్ధతి ఉంటుంది. మన శరీరానికి ఎంత నీరు అవసరమో తెలిసిందే. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. జపనీస్ నిద్రలేచి.. బ్రష్ చేయగానే 4 నుంచి 5 గ్లాసుల నీళ్లు గడగడా తాగేస్తారు. ఆ తర్వాత అరగంట వరకు ఏమీ తినరు. కాస్త కడుపు ఖాళీ అనిపించాక బ్రేక్‌ఫాస్ట్ తింటారు. మీరు కూడా జపనీస్‌లా నాజుగ్గా, అందంగా ఉండాలంటే ఈ పద్ధతి పాటించండి. తగినంత నీరు తాగడం వల్ల చర్మం కూడా మిలమిలా మెరిసిపోతుంది. మనం తాగే నీరు శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని, మెదడుకు తగిన ఆక్సిజన్ అందిస్తుంది. Images Credit: Pexels