చికెన్ కొనే ముందు ఈ విషయాలు మరిచిపోవద్దు - ఇలా ఉంటే పాడైందని అర్థం

మీ కళ్ల ముందు కోడి కోసి కట్ చేస్తే పర్వాలేదు. కానీ, ఈ మధ్య ఇంటికే చికెన్ పంపిస్తున్నారు.

అలాగే, పాడైన చికెన్ కూడా దుకాణాల్లో అమ్మేస్తున్నారు. కాబట్టి, ఈ విషయాలు తెలుసుకోండి.

తాజాగా కట్ చేసిన చికెన్ చక్కని పింక్ రంగును కలిగి ఉంది.

చికెన్ గ్రే కలర్ లోకి మారితే తీసుకోకపోవడం మంచిది.

చికెన్ మీద ఎరుపు, పసుపు గ్రే కలర్ మచ్చలు ఉంటే తీసుకోవద్దు.

ఒక వేళ చికెన్ మీద మచ్చలు ఉంటే కోడికి అంటు వ్యాధులు ఉన్నాయని అర్థం.

చికెన్ కట్ చేసి చాలా సేపు నిల్వ ఉంచితే ఓ రకమైన వాసన వస్తుంది. దాన్ని తీసుకోకపోవడం మంచిది.

రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చికెన్ కొనడం మానుకోండి.

ప్యాకేజ్డ్ చికెన్‌ను కొనుగోలు చేయకపోవడం మంచిది. All Photos Credit: Pixabay.com