వాష్ బేసిన్‌లకు నీరు వెళ్లే రంధ్రంతోపాటు అదనంగా పైన మరో రంధ్రం ఉంటుంది. మరి దానివల్ల ఉపయోగం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఈ వివరాలు మీ కోసమే. వాష్ బేసిన్‌లకు కామన్‌గా రెండు రంధ్రాలు ఉంటాయి. ప్రధాన రంధ్రం నుంచి మనం వాడే నీరు బయటకు వెళ్తుందనే సంగతి తెలిసిందే. టాప్‌కు దగ్గరగా ఉండే మరో చిన్న రంధ్రంతో పెద్దగా ఉపయోగం ఉండదేమో అనుకుంటాం. కానీ, ఆ రంధ్రం నీరు ఓవర్ ఫ్లో కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే.. ఆ రంధ్రం కూడా ఔట్‌లెట్ పైపుకే కనెక్టు అవుతుంది. వాష్ బేసిన్ మెయిన్ రంధ్రం మూసుకుని పోయినప్పుడు. నీరు బయటకు ఓవర్ ఫ్లో కాకుండా అడ్డుకుంటుంది. నీరు ఆ చిన్న రంధ్రంలోకి చేరి ఔట్‌లెట్ పైప్ ద్వారా బయటకు వెళ్తుంది. Images Credit: Pexels and Pixabay