సంతానసాఫ్యల్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఐవీఎఫ్ ఒక మంచి ప్రత్యామ్నాయం.

ఐవీఎఫ్ విషయంలో చాలా అపోహలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

ఇది కేవలం వయసుపైబడిన జంటలకు మాత్రమే అనే అపోహ ఉంది.

ఫేలోపియన్ ట్యూబ్ లు బ్లాక్ అయిన వారు, పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు ఉన్న దంపతులు ఎవరైనా ఈ చికిత్స తీసుకోవచ్చు.

35 సంవత్సరాల లోపు స్త్రీలు ఈ చికిత్స తీసుకుంటే చికిత్స విజయవంతం అవుతుంది.

ఏ వయసు వారైనా సరే ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అనేది అపోహ మాత్రమే.

ఐవీఎఫ్ సహజమైన ప్రక్రియ కాదు అనే అపోహ ఉంది. ఇది చాలా సహజమైన చికిత్సా విధానం.

ఐవీఎఫ్ తో తప్పకుండా గర్భధారణ జరుగుతుందని కూడా అనుకుంటారు. దీనికి చాలా అనుకూల పరిస్థితులు అవసరం

వయసు, ఆరోగ్యం, సంతానోత్పత్తి సమస్యలు, పిండ నాణ్యత వంటి అనేక విషయాలు ఐవీఎఫ్ విజయానికి అవసరం అవుతాయి.

అంతేకాదు ఒకసారి ఐవీఎఫ్ ఫలవంతం కానంత మాత్రాన ఇక అవకాశం లేదనేది కూడా నిజం కాదు.

4, 5 సార్లు ప్రయత్నించిన తర్వాత విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Images courtesy : Pexels