వెల్లకిల పడుకోవడం కంటే పక్కకి తిరిగి పడుకుంటే మైల్డ్ నుంచి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వరకు కూడా కంట్రోల్ అవుతుందట.

బరువు తగ్గితే గురక కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆల్కహాల్ లో ఉండే మత్తు వల్ల గొంతులోని కండరాలు అవసరానికి మించి రిలాక్స్ అవడం వల్ల గురక ఎక్కువ అవుతుంది.

హైడ్రేటెడ్ గా ఉంటే గురక తగ్గుతుంది. డీహైడ్రేషన్ వల్ల గురక సమస్య పెరగవచ్చు.

నిద్రకు ముందు ముక్కు, శ్వాస మార్గాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల గురక తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ద్వారా గురక సమస్య చాలా వరకు తగ్గుతుంది.

గదిలోని గాలి తేమగా ఉంచుకోవడం వల్ల కూడా శ్వాస మార్గాలు తేమగా ఉండి గురక సమస్య చాలా వరకు తగ్గుతుంది.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు



Images courtesy : Pexels