Chiranjeevi New Movie : ఫాంటసీ జానర్‌లో చిరంజీవి సినిమా - మెగా అప్డేట్ వచ్చేసిందోచ్!
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు ఓ గుడ్ న్యూస్! ఆయన హీరోగా ఓ ఫాంటసీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ, దాని తర్వాత చేస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి సినీ ప్రయాణంలో ఇది భారీ బడ్జెట్ సినిమా అవుతుందని చెబుతున్నారు. మెగాస్టార్ 157వ సినిమా ఇది. సో... #Mega157 వర్కింగ్ టైటిల్ తో వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.
మెగా ఫిల్మ్... మెగా స్టార్ట్!
మెగాస్టార్ 157వ సినిమా గురించి దర్శకుడు వశిష్ఠ ఓ అప్డేట్ ఇచ్చారు. 'మెగా స్టార్ట్ టు మెగా ఫిల్మ్' అంటూ హీరో, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రేక్షకులు అందరినీ సినిమాటిక్ అడ్వెంచర్ లోకి తీసుకు వెళతామన్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ - చంద్రబాబు అరెస్టా? పార్టీ మీటింగా?
సోషియో ఫాంటసీ అండ్ చిరంజీవి!
సోషియో ఫాంటసీ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తప్పకుండా ఉంటుంది. చిరంజీవి కెరీర్ మొత్తంలో టాప్ 10 ఫిలిమ్స్ తీస్తే... ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. దాని తర్వాత 'అంజి' అని మరో సోషియో ఫాంటసీ సినిమా చేశారు మెగాస్టార్. కొంత విరామం తర్వాత మళ్ళీ ఆ జానర్ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అయిన 'బింబిసార' కూడా సోషియో ఫాంటసీ చిత్రమే. అందువల్ల, ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల విడుదల చేశారు. అది చూస్తే... భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం - పంచ భూతాలు ఉన్నాయి. నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. పంచ భూతాలతో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు? అనేది ఆసక్తికరం. ప్రేక్షకుల ఊహలకు అతీతంగా కథ, కథనాలు ఉంటాయని తెలిసింది.
Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?
వశిష్ఠ సినిమా కాకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి ఇంకో సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మిస్తారు. అందులో త్రిష కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఓ యువ కథానాయకుడికి కూడా చోటు ఉందని తెలిసింది. సిద్ధూ జొన్నలగడ్డతో పాటు పలువురి యంగ్ హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 'భోళా శంకర్' తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి... ఒక దాని తర్వాత మరొకటి, ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. కొన్ని రోజుల పాటు ఆయన రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని కూడా డిసైడ్ అయ్యారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial