AP Tickets Chiranjeevi: మౌనమేల మంచు? మళ్లీ చిరంజీవి పైనే భారం.. ఏపీ టికెట్ ధరలపై చర్చలకు సిద్ధమేనా?
ఏపీ ప్రభుత్వంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు టాలీవుడ్ తరపున చిరంజీవి చొరవ తీసుకుంటున్నారు. మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌లతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాలీవుడ్‌ను ఒడ్డున పడేసేందుకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం.. పెద్ద సినిమాల విడుదలకు క్యూ కట్టి ఉండటంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్న ఉద్దేశంతో చర్చలకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇప్పటి వరకూ మంచు కుటుంబం వైపు చూస్తూ ఉంది. ‘మా’ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ సీఎం జగన్ తనకు సమీప బంధువని విష్ణు పదే పదే చెప్పుకున్నారు. అయితే సమస్య వచ్చినప్పుడు ఆయన సైలెంట్ అయిపోవడం.. టాలీవుడ్ సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి రావడంతో చిరంజీవే చొరవ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
‘మా’ ఎన్నికలు జరగక ముందు టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవికి మంత్రి పేర్ని నాని ఆహ్వానం పలికారు. సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్ ఖరారైందని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. తర్వాత పేర్ని నాని హైదరారాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. ఆ తర్వాత సీఎం జగన్ వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై టాలీవుడ్ స్టేక్‌హోల్డర్స్‌తో చిరంజీవి చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తర్వాత ఏమయిందో కానీ చర్చలు ఆగిపోయాయి. చిరంజీవికి ఆహ్వానం అందలేదు. కానీ టాలీవుడ్‌పై ప్రతీకార చర్యల తరహాలో వరుసగా ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
ఈ క్రమంలో ‘మా’ ఎన్నికలు రావడం.. చిరంజీవి మద్దచ్చినట్లుగా ప్రచారం జరిగిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోవడంతో సీన్ మారిపోయింది. మంచు విష్ణు తండ్రి.. ఆయన ప్యానల్‌ను నడిపించిన మోహన్ బాబు అంతా పెద్దరికం తీసుకుని మాట్లాడారు. సీఎం జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉండటం.. ఇండస్ట్రీ తరపున పెద్ద మనిషిగా కూడా మారడంతో ఆయనే చొరవ తీసుకుంటారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఆ వైపు నుంచి స్పందన లేదు. దీంతో చిరంజీవి రేపో మాపో ఏపీ సినిమాటోగ్రఫీమంత్రి పేర్ని నానితో భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారు. ‘మా’కు, సినిమా టికెట్ల రేట్లకు సంబంధం లేదు. దానిపై పూర్తిగా నిర్మాతలదే బాధ్యత. కానీ, ఆ ప్రభావం పరోక్షంగా నటీనటులపైన కూడా పడుతుంది. పైగా మంచు విష్ణు, మోహన్ బాబు కూడా నిర్మాతలే. కనీసం ఆ రకంగానైనా టాలీవుడ్ ఘోష వినిపిస్తారని అంతా భావించారు. ఆ రోజు టికెట్ ధరలపై పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు మోహన్ బాబు ‘మా’ ఎన్నికల తర్వాత సమాధానం ఇస్తానని అన్నారు. కానీ, ‘మా’ ఎన్నికల తర్వాత మౌనమే సమాధానమైంది.
Also Read: టికెట్ రేట్స్... కెసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి!
ముందుగా పేర్నినానితో చర్చించి.. ఆ తర్వాత సీఎం జగన్‌తో నూ సమావేశం కావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కనీసం తెలంగాణలో నిర్ణయించినట్లుగా అయినా టిక్కెట్ ధరలను నిర్ణయించాలని కోరే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇంత కఠినంంగా ఎందుకు వ్యవహరిస్తోంది.. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హామీలు కోరుతోందన్న అంశాలపై స్పష్టత వస్తేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
Also Read: టాలీవుడ్‌పై తెలంగాణ సర్కార్ చల్లని చూపు... టిక్కెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి