అన్వేషించండి

Chiranjeevi - Jani Vs Sekhar: శేఖర్ వర్సెస్ జానీ... ఇష్యూ సెటిల్ చేసిన చిరంజీవి

Jani Master On Issue With Sekhar: తనకు, శేఖర్ మాస్టర్‌కు మధ్య సమస్య ఏమీ లేదని జానీ స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి చిరంజీవి దగ్గరకు వెళ్లిన ఫోటోలు విడుదల చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శేఖర్, జానీ మాస్టర్ల మధ్య డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ జరిగింది.
  • అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షురాలి ఏకపక్ష నిర్ణయాల వివాదానికి కారణం.
  • చిరంజీవి జోక్యంతో సమస్య పరిష్కారమై ఇద్దరూ కలిసిపోయారు.
  • తమ మధ్య గొడవలు లేవని జానీ మాస్టర్ మీడియాకు తెలిపారు.

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ (Sekhar Master), జానీ మాస్టర్ (Jani Master) పేర్లు తప్పకుండా ఉంటాయి. పాన్ ఇండియా సినిమాలకే కాదు... హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో పాటలకూ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే... ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవ చర్చకు దారి తీసింది. తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ మీటింగ్‌లో ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ వాగ్వాదానికి దిగడం, పోలీసుల జోక్యం చేసుకోవడం తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది.

అసలు గొడవ ఏమిటి? కారణం ఏమిటి?
డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, మెంబర్షిప్ అంశాలు గొడవకు కారణమని వైరల్ అయిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయ్యింది. జానీ మాస్టర్ భార్య సుమలత, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపిస్తూ పది మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారని టాక్. జానీ, సుమలత దంపతులపై ఆరోపణలు చేస్తూ బషీర్ మాస్టర్ ఓ వీడియో విడుదల చేశారు.

సమస్యను పరిష్కరించిన చిరంజీవి!
డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి... ఇద్దరినీ తన దగ్గరకు పిలిపించుకున్నారు. ప్రస్తుతం బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆయన... ఆ సెట్స్‌లో మాస్టర్స్ ఇద్దరితో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు.

సోమవారం సాయంత్రం శేఖర్ మాస్టర్, తనకు మధ్య ఎటువంటి గొడవలు లేవని జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. తామిద్దరం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములమని పేర్కొన్నారు. ఫేక్ వైరల్ వీడియోలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. తమ మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయాయని తెలిపారు.

Also Read: Lenin Box Office Collection Day 4 - అయ్యగారి జోరు తగ్గిందా? 'లెనిన్' మండే కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?

జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనేది డిస్కస్ చేసేందుకు వచ్చాం. కొన్ని విషయాలపై చర్చించుకున్నాం. కొన్ని వీడియోలు పట్టుకుని నాకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు. అవన్నీ ఫేక్. శేఖర్ మాస్టర్, బాను మాస్టర్... అందరూ మంచి వ్యక్తులు. మేం ఎవరికి ఎవరూ శత్రువులం కాదు. అందరికి అందరం సపోర్ట్‌గా ఉంటాం'' అని చెప్పారు.

Also Read: Korean Kanakaraju Teaser Review - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా

చిరంజీవి గురించి జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''వైరల్ వీడియోలు చూసి చిరంజీవి గారు కూడా మాతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్ గారు, నేను, చిరంజీవి గారు కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. మాలో ఎలాంటి గొడవలు లేవు. మాకు చిరంజీవి గారితో పాటు మన హీరోలు అందరూ సపోర్ట్ చేస్తుంటారు. టాలెంట్ ఉన్నవారిని మన హీరోలు ఎంకరేజ్ చేస్తారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి థాంక్స్ చెబుతున్నాం. మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన డ్యాన్స్, ఆయన సినిమాలు, ఫైట్స్ చూసే ఇక్కడకు వచ్చాం. మనకు డ్యాన్స్ అంటే చిరంజీవి గారే'' అని చెప్పారు. 

Also Read: Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా

Frequently Asked Questions

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవ ఎక్కడ జరిగింది?

డ్యాన్సర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో వారిద్దరూ గట్టిగా అరుచుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఈ గొడవతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

వారిద్దరి మధ్య వివాదానికి ప్రధాన కారణం ఏమిటి?

డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వం అంశాలు గొడవకు కారణమయ్యాయి. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నించడం కూడా ఒక కారణం.

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య వివాదాన్ని ఎవరు పరిష్కరించారు?

మెగాస్టార్ చిరంజీవి గొడవ గురించి తెలుసుకొని వారిద్దరినీ పిలిపించారు. తన సినిమా సెట్స్‌లో వారితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.

వివాదం పరిష్కారం అయ్యాక జానీ మాస్టర్ ఏం చెప్పారు?

తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములమని జానీ మాస్టర్ తెలిపారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget