Vennela Kishore : హీరోగా 'వెన్నెల' కిశోర్ - 'చారి 111' రంగంలోకి దిగితే?
Vennela Kishore Samyuktha Viswanathan's first look - Chaari 111 movie : 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'. స్పై యాక్షన్ కామెడీగా రూపొందుతున్న సినిమా ఇది.
Vennela Kishore first look in Chaari 111 : ఈతరం కమెడియన్లలో స్టార్ స్టేటస్ అందుకున్నది ఎవరంటే... ముందు వరుసలో వినిపించే పేరు 'వెన్నెల' కిశోర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. దీనికి టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. ఇంతకు ముందు సుమంత్ 'మళ్ళీ మొదలైంది'కి ఆయన దర్శకత్వం వహించారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
స్టైలిష్ గూఢచారిగా 'వెన్నెల' కిశోర్
'చారి 111' ఫస్ట్ లుక్ చూస్తే... 'వెన్నెల' కిశోర్ స్టైలిష్ స్పై రోల్ చేస్తున్నారని ఈజీగా అర్థం అవుతోంది. సూటు, బూటు వేసి- గన్ పట్టుకుని కనిపించారు. ఆయన వెనుక సంయుక్తా విశ్వనాథన్ గ్లామర్ లుక్ చూపించారు. ఆవిడ చేతిలో కూడా గన్ ఉంది. సో... హీరోయిన్ కూడా యాక్షన్ సీన్స్ చేస్తారని ఊహించవచ్చు. ఆ వెనుక చూస్తే ఛార్మినార్ కనబడుతోంది. హైదరాబాద్ నేపథ్యం కథతో సినిమా రూపొందిస్తున్నారు అన్నమాట! బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కార్ కూడా ఉన్నాయి. అసలు కథ ఏమిటనేది తెలియడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.
Also Read : అర్థం చేసుకోండి... బాలీవుడ్ సింగర్‌తో మృణాల్ ఠాకూర్ లవ్ ఎఫైర్!?
Presenting you most dynamic First Look poster of Telugu feature movie '#Chaari111,' a spy action-comedy featuring our very own Kaka #VennelaKishore, #MuraliSharma, and #SamyukthaViswanathan in the lead roles.
— Pulagam Chinnarayana (@PulagamOfficial) November 14, 2023
Written & Directed by @tgkeerthikumar
Produced by @aditisoni1111… pic.twitter.com/SOytq5CZ52
సినిమా అనౌన్స్ చేసినప్పుడు కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. ప్రశాంతంగా ఉండే నగరానికి ప్రమాదం రావడంతో... ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) వస్తారు. అతను ఎలా సాల్వ్ చేశానేది సినిమా. సినిమాలో హిలేరియస్ కామెడీ సీన్లతో పాటు సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ కూడా ఉందట.
'చారి 111' గురించి దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. ఎప్పుడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ గందరగోళానికి గురయ్యే గూఢచారి పాత్రలో 'వెన్నెల' కిశోర్ కనిపిస్తారు. ఆయన కడుపుబ్బా నవ్విస్తారు. గూఢచారి సంస్థలో కీలకమైన హెడ్ పాత్రలో, కథలో కీలకమైన క్యారెక్టర్ మురళీ శర్మ చేశారు'' అని చెప్పారు. నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం హైలైట్ అవుతాయి. షూటింగ్ కంప్లీట్ చేశాం' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి.
'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: రిచర్డ్ కెవిన్ ఎ, పోరాటాలు: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాలు కొమిరి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత: అదితి సోనీ, రచన & దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్.