Brahmastram Promotions : రాజమౌళి గారూ, ఒక్కసారి గిచ్చరా? - సుమ కనకాల సూపర్ ఫన్
Ranbir Kapoor Focuses On Telugu Market : రణ్‌బీర్ కపూర్ తెలుగు మార్కెట్ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు ఉన్నారు. హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడమే కాదు... తెలుగు టీవీ షోలో పార్టిసిపేట్ చేశారు.
హిందీలో మాత్రమే సినిమాలు హిట్ అయితే చాలదు... దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులనూ ఆకట్టుకోవాలని బాలీవుడ్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. హిందీ తర్వాత దేశంలో అతిపెద్ద మార్కెట్ అయిన తెలుగు మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీ హీరోలు అందరూ హైదరాబాద్ వచ్చి తెలుగులో తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ ఒక అడుగు ముందుకు వేసి... తెలుగు టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు.
'బ్రహ్మాస్త్ర' కోసం... సుమ 'క్యాష్'లో!
రణ్‌బీర్ కపూర్, ఆయన సతీమణి ఆలియా భట్ జంటగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie). సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రచారం నిమిత్తం రెండు సార్లు రణ్‌బీర్, ఆలియా అండ్ టీమ్ హైదరాబాద్ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా... జరగలేదు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ప్రెస్ మీట్ మాత్రమే నిర్వహించారు. అంతే కాదు... సుమ 'క్యాష్' ప్రోగ్రామ్‌లో కూడా సందడి చేశారు.
రాజమౌళి గారూ, ఒక్కసారి గిచ్చరా?
Suma Kanakala Fun With SS Rajamouli - Cash Latest Promo : క్యాష్' ప్రోగ్రామ్‌లో సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు వస్తుంటారు. అది సహజమే. అయితే... ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి రావడంతో 'క్యాష్' ప్రోగ్రామ్ హోస్ట్, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆనందానికి అవధులు లేవు. 'రాజమౌళి గారూ... ఒక్కసారి గిచ్చరా?' అంటూ ఆయన దగ్గరకు వెళ్లారు. గిచ్చిన తర్వాత 'ఆ వచ్చారు... వచ్చారు' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె రియాక్షన్ సూపర్ అని చెప్పాలి.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
సుమ కనకాల అంటే ఫన్. ఫన్ అంటే సుమ కనకాల. 'క్యాష్'లో రణ్‌బీర్ కపూర్, ఆలియా, రాజమౌళితో ఆమె ఎంత వినోదం పండించారో? స్పాంటేనియస్‌గా ఎన్ని పంచ్ డైలాగ్స్ వేశారో చూడాలంటే... త్వరలో విడుదల కానున్న షో చూడాలి. సెప్టెంబర్ 9న సినిమా విడుదల కానుంది కనుక... అంత కంటే ముందు షో టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది (Brahmastra Promotions In Hyderabad).
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా ప్రచారం గతంలో ఆలియా భట్ (Alia Bhatt) హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సుమ కనకాలతో ఆమెకు పరిచయం అయ్యింది. షోలో కూడా ఆలియా సూపర్ యాక్టివ్ గా ఉన్నారని, బాగా నవ్వించారని టాక్.
హిందీలో రణ్‌బీర్ కపూర్ స్టార్ హీరో. నటుడిగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ... కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలోకి కపూర్ కుటుంబ వారసుడిగా రణ్‌బీర్ అడుగు పెట్టినప్పటికీ... తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.