By: ABP Desam | Updated at : 04 Apr 2023 01:29 PM (IST)
'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్
Brahmmastra : గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజైన పాన్ ఇండియా ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ' పేరుతో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ లోనే హిందీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి... రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరోసారి వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2', 'బ్రహ్మాస్త్ర పార్ట్ 3' రెడీ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రెండవ, మూడవ భాగాల విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పార్ట్ 2ను డిసెంబర్ 2026లో, పార్ట్ 3ని డిసెంబర్ 2027లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. దాంతో పాటు ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో అగ్ర నటులైన బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున లాంటి వారు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ రిలీజై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ 5ఏళ్ల అయాన్ ముఖర్జీ కష్టం ఈ సినిమాతో సఫలమైందని సినీ వర్గాల టాక్.
అయితే బ్రహ్మాస్త్ర మూడు భాగాలుగా రాబోతుందని మూవీ మేకర్స్ పార్ట్ 1 ప్రారంభంలోనే వెల్లడించగా... తాజాగా మిగతా రెండు భాగాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రిలీజ్ చేశారు.
దక్షిణాది వెర్షన్స్ కు అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమా రెండో భాగం డిసెంబర్ 2026లో, మూడో భాగాన్ని డిసెంబర్ 2027లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు అభిమానులను ఉద్దేశించి ఓ ఓపెన్ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకేసారి బ్రహ్మాస్త్ర 2, 3 భాగాల షూటింగ్ ను జరుపుతామని, అలానే పెద్దంత తేడా లేకుండా ఈ రెండు సినిమాలను జనం ముందుకు తీసుకొస్తామ’ని స్పష్టం చేశారు. పార్ట్ 1కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి మిగతా 2 పార్ట్ లను తీర్చిదిద్దడం దర్శకుడు అయాన్ కు పెను సవాల్ గా మారింది. అందులో భాగంగానే ఇంత టైం తీసుకుంటున్నారని సినీ వర్గాల టాక్.
Also Read : సల్మాన్, వెంకీతో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ - కుమ్మేశారంతే!
దీంతో బ్రహ్మాస్త్ర నెక్స్ట్ పార్ట్ కోసం మరో మూడేళ్లు ఆగాల్సి ఉండడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నట్టు సమాచారం. కానీ ది బెస్ట్ మూవీగా తెరకెక్కాలంటే ఆ మాత్రం ఉండాల్సిందేనని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇక బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ మెస్మరైజింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకోగా.. ఇప్పుడు పార్ట్ 2 అండ్ 3 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మైథలాజికల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ బిగ్ మూవీ... ఓటీటీలోనూ సంచలనం సృష్టించింది.
Also Read : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?