Brahmanandam In PSPK-SDT's Movie : పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం - త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుని మరీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గురూజీ త్రివిక్రమ్, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
![Brahmanandam In PSPK-SDT's Movie : పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం - త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుని మరీ... Brahmanandam To Appear in Pawan Kalyan and Sai Dharam Tej's remake Movie Brahmanandam In PSPK-SDT's Movie : పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం - త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుని మరీ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/28/8468ad0fa9ec2666f0195ef3ea82ba031677574566650313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), నవ్వుల రారాజు బ్రహ్మానందం (Brahmanandam)... ముగ్గురూ కలిస్తే కామెడీ మామూలుగా ఉండదు. 'జల్సా', 'అత్తారింటికి దారేది'లో పవన్ కళ్యాణ్ - బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు ఇప్పటికీ నవ్విస్తాయి. త్రివిక్రమ్ సినిమాల్లో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్లు బావుంటాయి. 'జులాయి', 'ఖలేజా' సినిమాల్లో బ్రహ్మి భలే నవ్వించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
పవన్ - సాయి తేజ్ సినిమాలో బ్రహ్మి!
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేస్తున్నారు కదా! సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నారు.
సముద్రఖని ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'వినోదయ సీతమ్'కి ఈ సినిమా రీమేక్. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుకు కావాల్సిన మార్పులు, చేర్పులు చేశారట. అంతే కాదు... బ్రహ్మానందం కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేశారట. పవన్, సాయి తేజ్, బ్రహ్మి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం.
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.
పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అందుకని, ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ చేస్తారని సమాచారం.
Also Read : మంగళవారమే 'మంగళవారం' అనౌన్స్‌మెంట్ - 'ఆర్ఎక్స్ 100' దర్శకుడి సౌత్ ఇండియన్ సినిమా
'వినోదయ సీతమ్' తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) కూడా సినిమాలో ఉన్నారు. ఈ రోజు ఆమె గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో శ్రీ లీల ప్రత్యేక గీతం చేయనున్నారని సమాచారం.
'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది ఆయన నుంచి రెండు సినిమాలు రావచ్చని వినబడుతుంది. షూటింగ్ స్పీడ్ బట్టి రిలీజులు డిసైడ్ అవుతాయి.
Also Read : భార్య, పిల్లలతో తారకరత్న లాస్ట్ ఫోటో ఇదే - ఎమోషనల్ అయిన అలేఖ్యా రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)