Ram Charan: రామ్ చరణ్, సుకుమార్ మూవీపై క్రేజీ అప్డేట్ - హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
Ram Charan Sukumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Bollywood Actress To Play Female Lead Role In Ram Charan Sukumar Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన తర్వాత ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ!
ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారట. ఆమెను టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా వివరించారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్‌లో కృతి 3 సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. వీటి తర్వాత ఆమె బాలీవుడ్‌లోనే మూవీ చేశారు. ఫస్ట్ సుకుమార్ డైరెక్షన్‌లోనే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'వన్ నేనొక్కడినే' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి. ఆ తర్వాత దోచెయ్, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇవి నిరాశపరిచాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో మూవీలో జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: నెట్టింట లీకైన పవన్ 'ఓజీ' ట్రైలర్... ఫ్యాన్స్‌కు పూనకాలే... లాస్ట్ షాట్ ఇచ్చే కిక్కే వేరప్పా
సుకుమార్ ఈ మూవీపై స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. కేవలం డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారట. వీరిద్దరి కాంబోలో ఇది వరకే వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మరి ఈ మూవీ ఏ జానర్‌లో ఉండబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత అంతకు మించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.
'పెద్ది' తర్వాతే...
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా హై మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్‌గా బెంగుళూరులో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గ్లింప్స్‌లో చరణ్ సిగ్నేచర్ షాట్ వేరే లెవల్‌లో ఉంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బీజీఎం గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. త్వరలోనే మాస్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చేలా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.
మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, అర్జున్ అంబటి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ మదర్ రోల్‌లో 'అఖండ'లో బాలయ్య తల్లి పాత్రలో నటించిన తమిళ నటి విజి చంద్రశేఖర్ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















