Janhvi Kapoor : వీడియో - వీడియో: ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, పక్కనే మహేశ్వరి కూడా!
Jahnvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
Janhvi Kapoor celebrates birthday in Tirupati with boyfriend : అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ధడక్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ రోజు (బుధవారం) తన 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు జాన్వీ కపూర్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఇందుకు. సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
జాన్వి కపూర్ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమెతోపాటు తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, శ్రీదేవి సోదరి ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి, బాలీవుడ్ సోషల్ మీడియా సెలెబ్రిటీ ఒర్రీ కూడా ఉన్నారు. జాన్వీ కపూర్ సాంప్రదాయ దుస్తుల్లో పింక్ కలర్ లంగా వోనిలో వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. అలాగే బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా సైతం పట్టు పంచెలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జాన్వీ కపూర్ కి 'దేవర' టీమ్ విషెస్
జాన్వి కపూర్ బర్త్డే సందర్భంగా 'దేవర' మూవీ టీం ఆమెకి స్పెషల్ పోస్టర్ తో విషెస్ అందజేశారు. ఈ సినిమాలో జాన్వి 'తంగం' అనే పాత్రలో నటిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈరోజు 'దేవర' నుంచి జాన్వి కపూర్ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో జాన్వి చీరకట్టులో క్యూట్ గా నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా దేవర సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న థియేటర్స్ లో విడుదల కానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ తో జోడి
ఎన్టీఆర్ సరసన 'దేవర'తో సౌత్ ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న జాన్వి కపూర్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే టాలీవుడ్ లో రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ అందుకుంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్నట్లు జాన్వి కపూర్ తండ్రి బోనీకపూర్ ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈరోజు జాన్వి కపూర్ బర్త్డే సందర్భంగా 'RC16' మూవీ టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ జాన్వి కపూర్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపింది.
Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రీ రిలీజ్ కాబోతున్న 'నాయక్', ఎప్పుడంటే?