అన్వేషించండి

Salman khan Marriage: ఈ రోజుల్లో అది కష్టం - సల్మాన్ ఖాన్ పెళ్లిపై తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Salman khan Marriage: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఆయన తండ్రి సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో తన కొడుకు కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకడం కష్టమన్నారు.

Salman khan Marriage: బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. కండల వీరుడి ప్రస్తుత వయస్సు 58 ఏళ్లు. మరో రెండేళ్లలో షష్టి పూర్తి హీరోగా మారబోతున్న తమ అభిమాన హీరో ఎప్పుడు పెళ్ళి వార్త చెబుతారా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తోటి హీరోలు, అతని సోదరులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో హాయిగా జీవిస్తున్నారు కానీ.. సల్లూ భాయ్ మాత్రం ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. అయితే సల్మాన్ ఎందుకు వివాహం చేసుకోలేదనే విషయంపై ఆయన తండ్రి సలీమ్‌ ఖాన్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సింపుల్‌ గా ఉంటాడు కాబట్టే సల్మాన్‌ ఖాన్ అందరికీ నచ్చుతాడని తండ్రి సలీం ఖాన్ అంటున్నారు. ఏ అమ్మాయినైనా సల్మాన్ త్వరగా ఇష్టపడతాడు కానీ, పెళ్ళి చేసుకొనే ధైర్యం మాత్రం తన కొడుక్కి లేదని పేర్కొన్నారు. తన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి తన తల్లి మాదిరిగా ఫ్యామిలీని చూసుకుంటుందో లేదో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడని సల్మాన్ తండ్రి తెలిపారు. తన కొడుకు ప్రతీ అమ్మాయిలో తన అమ్మలాంటి లక్షణాలను వెతుకుతాడని చెప్పారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి తన తల్లిలాగే భర్త పిల్లలకు అంకితం అవ్వాలని కోరుకుంటాడని.. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులకు సాయం చెయ్యాలని అనుకుంటాడనన్నారు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు దొరకడం అంత ఈజీ కాదని, అందుకే సల్మాన్‌ ఇప్పటిదాకా పెళ్ళి చేసుకోలేదని తండ్రి సలీమ్‌ ఖాన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

నిజానికి సల్మాన్ ఖాన్ లవ్, ఎఫైర్స్ గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఆయనకు ఎందరో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నట్లుగా రూమర్స్ వినిపించాయి. ఫలానా హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని, ఫలానా అమ్మాయితో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడని, రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడని.. ఇలా నిత్యం ఏదొక పుకారు బీ టౌన్ లో చక్కర్లు కొడుతూనే ఉండేది. ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా, జియా ఖాన్.. ఇలా చెప్పుకుంటే సల్మాన్ లిస్టులో అనేక మంది ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కరోనా లాక్ డౌన్ లో రొమేనియన్‌ బ్యూటీ మోడల్ కమ్ ప్లేబ్యాక్ సింగర్ లూలియా వంటూర్‌ ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ వీటిల్లో ఏదీ నిజం కాలేదు.

సల్మాన్ ఖాన్ గతంలో ఓ మూవీ ప్రమోషన్‌లో తన ప్రేమ కథలు, బ్రేకప్ ల గురించి మాట్లాడుతూ.. తన జీవితంలోకి సరైన అమ్మాయి వచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటానని అన్నారు. తన మాజీ ప్రియురాల్లు అందరూ మంచి వారేనని, వాళ్ల సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదని తెలిపారు. తను వాళ్లను సరిగ్గా చూసుకోలేనేమోనన్న భయంతోనే తనకు బ్రేకప్‌ చెప్పి ఉంటారని, వాళ్లు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తన లవ్ స్టోరీలన్నీ తనతోనే సమాధి అవుతాయన్నారు సల్మాన్. మరో సందర్భంలో తనకు పెళ్లి వద్దు కానీ, పిల్లలు మాత్రం కావాలన్నారు. ఒక పాపను పెంచుకోవాలి అనుకుంటున్నాని, అందుకు లీగల్ గా మన చట్టాలు అంగీకరిస్తాయో లేదో తెలియదని సల్మాన్ అన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే, ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ రంజ్ కు తగ్గ సక్సెస్ సాధించలేకపోతున్నారు. రాధే, కిసీకా భాయ్ కిసీకి జాన్, టైగర్-3 వంటి సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. అతిథి పాత్ర పోషించిన 'పఠాన్' మూవీ మాత్రం హిట్టయింది. సల్మాన్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో 'సికిందర్' అనే సినిమాలో నటిస్తున్నారు.

Also Read: 28 ఏళ్ళ తర్వాత ఒకే ఫ్రేమ్‌లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' జంట

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget