అన్వేషించండి

Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునయన - కారు ఫీచర్స్, ధర తెలిసి షాకవుతున్న నెటిజన్స్!

Deepthi Sunaina Buy New Car: యూట్యూబ్‌ స్టార్‌ దీప్తి సునయన కొత్త కారు కొన్నది. అయితే అందరిలో బ్రాండ్స్‌ జోలికి పోకుండ ఆమె వెరైటీ కారు కొన్నది. దీంతో ఆమె కారు ఫీచర్స్‌, ధర తెలిసి షాక్‌ అవుతున్నారు.

Deepthi Sunaina Buys New Car: యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం దీప్తి సునయన గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌తో లైమ్‌లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత కవర్‌ సాంగ్స్‌,  షార్ట్‌ ఫిలింస్‌తో యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసే సందడి అంతా ఇంత కాదు.  సోషల్‌ మీడియాలో తరచూ తన హాట్‌హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఇక మరో యూట్యూబర్‌ షణ్మఖ్‌ జశ్వంత్‌తో ప్రేమ, బ్రేకప్‌తో దీప్తి సునయన బాగా గుర్తింపు పొందింది. వారిద్దరి బ్రేకప్‌ నెట్టింట ఎంత చర్చనీయాంశమైందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. అతడితో బ్రేకప్‌ తర్వాత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన అల్భమ్‌ సాంగ్స్‌లో నటిస్తూ, నిర్మిస్తూ ఫుల్‌ బిజీగా గడిపేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సొంతంగా ఓ ఇల్లు కొన్న దీప్తి.. తాజాగా లగ్జరీ కారు కొన్నది.

కారు ఫిచర్స్ తెలిసి షాకవుతున్న నెటిజన్లు

అందరిలో కంఫర్ట్స్‌, స్పెషియస్‌ కారు కాకుండా.. కాస్తా డిఫరెంట్‌ కారు కొన్నది. ఈ కారు కోసం బాగానే ఖర్చుపెట్టిన ఆమె ఇలాంటి కారు ఎందుకు కొన్నదబ్బా.. అంటున్నారు. ఇంతకి ఆమె కొన్న కారు ఏంటీ, ఫిచర్స్‌ ఎలా ఉన్నాయంటే.  దీప్తి సునయన కొన్న కారు టయోటా హై లక్స్‌. ఈ వాహనం ప్రత్యేకత ఏంటంటే ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే కూర్చోవచ్చు. ఇది ఏసీ క్యాబిన్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్‌ ఇస్తుంది. ఇక వెనుక లగేజ్‌ పెట్టుకోవడానికి, సరుకు రావాణాకి ప్రత్యేకమైన స్పెస్‌ ఉంటుంది. చెప్పాలంటే ఈ కారు దగ్గరి దగ్గరి వేకేషన్‌, టూర్స్‌కి సౌకర్యంగా ఉంటుంది. అంత ఖర్చు పెట్టి బెంజ్‌, బిఎమ్‌డబ్ల్యూ వంటి బ్రాండ్స్‌కు పోకుండ ఆమె ఇలాంటి కారు కొనడంపై ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారుతో దీప్తికి ఏం పని అని అంతా ఆరా తీస్తున్నారు. ఏదైమేన కొత్త కారు దీప్తికి మాత్రం సోషల్‌ మీడియాలో మాత్రం శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

నటిగా, నిర్మాతగా

ఈ దీప్తి తన ఫ్యామిలీ, క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ కారు కొనేందుకు వెళ్లింది. షో రూంలో కారు కొంటున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేయగా ఈ వార్త వైరల్‌ అవుతుంది. దీప్తి కొన్న ఈ కారు ధర బేసిక్‌ మోడల్‌ రూ.30 లక్షల నుంచి రూ. 37 లక్షల వరకు ఉంటుందట. కాగా దీప్తి సునయన నటించిన పలు కవర్స్‌ సాంగ్స్‌ ఎంతో పాపులర్‌ అయ్యాయి. యూట్యూబ్‌లో అయితే ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక ఇటీవల ఆమె నటించిన ‘ఏమోనే’ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాట మంచి విజయం సాధించింది. ఇందులో దీప్తి సునయన, విశాల్ జంటగా నటించగా దానికి డీఓపీగా వినయ్ షన్ముఖ్ దర్శకత్వం వహించాడు. విజయ్ బల్గానిన్ సంగీతం అందించిన ఈ ఈ వీడియో సాంగ్‌ స్వయంగా దీప్తి సునైనా నిర్మాతగా వ్యవహరించింది. మాకా సంపత్ కుమార్‌తో కలిసి ఆమె నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అప్పటి వరకు నటనకే పరిమితమైన ఆమె ఈ పాట నిర్మాతగాను మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget