Punarnavi Bhupalam: ప్రేమలో పడిన పునర్నవి భూపాలం! - ఎట్టకేలకు బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది..
Punarnavi Bhupalam Boyfriend Details:బిగ్‌బాస్ పేం, నటి పునర్నవి ప్రేమలో పడిందా?. ఇలా బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది.
Punarnavi Bhupalam Birthday Wishes to Boyfriend: బిగ్‌బాస్ పేం, నటి పునర్నవి ప్రేమలో పడిందా?. ఇలా బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. 'ఉయ్యాల జంపాల' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ తెలుగు అమ్మాయి ఆ తర్వాత పలు సినిమాల్లో లీడ్ రోల్లోనూ కనిపించింది. ఆ తర్వాత బిగ్‌బాస్ 3వ సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చి అలరించిన పునర్నవి ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమైంది.
హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ
ప్రస్తుతం ఫారెన్‌లో హయ్యర్ స్టడిస్ చేస్తున్న ఆమె అప్పుడప్పుడ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తుంది. తన ఫోటోలు, పోస్ట్స్ షేర్ చేస్తూ అలరిస్తు వస్తుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని ఆమె సడెన్‌లో ఓ పోస్ట్ షేర్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఓ అబ్బాయితో చాలా క్లోజ్ దిగిన ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. పైగా హర్ట్ ఎమోజీలను కూడా జత చేసింది. ఇంతకి ఆ పోస్ట్ ఏంటంటే.. పునర్నవి ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. వెనకాలు నుంచి ఇద్దరు కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే వన్ అండ్ ఓన్లీ. 28 మీకు పర్ఫెక్ట్ మ్యాచ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇలా బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేసిందా?
అయితే ఇక్కడ ఆ అబ్బాయి ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వారిద్దరే ఒంటరిగా ఉన్న ఫోటోని షేర్ చేసి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో పడేసింది. కొంతమంది అతడు తన బాయ్‌ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఏంటీ పునర్నవి ప్రేమలో పడ్డావా? నీ బాయ్ ఫ్రెండ్ అతడేనా? అతడిని పరిచయం చేశావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆమె పోస్ట్ చూస్తుంటే కూడా పునర్నవి ప్రేమలో ఉంది అనే అభిప్రాయాలు బాగా వస్తున్నాయి. దీంతో అంతా పునర్నవి ఇప్పుడు సింగిల్ కాదని ఫిక్స్ అయిపొతున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వార్తలనే నిజం చేస్తూ పునర్నవి రిలేషన్‌షిప్‌ని ఆఫీషియల్ చేస్తుందా? అలాంటిది ఏం లేదు ఫ్రెండ్ అంటూ ట్విస్ట్ ఇస్తుందా? చూడాలి.
కాగా గతంలోనూ పునర్నవి ఇలానే ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తను నటించిన ఓ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వ్యక్తితో దిగిన ఫోటోలను షేర్ చేసి అందరికి షాకిచ్చింది. పునర్నవి ప్రేమలో పడిందని, పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ ప్రచారం జరగడంతో అది మూవీ ప్రమోషన్స్ భాగంగా చేసిన పోస్ట్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. కాగా బిగ్‌బాస్ 3 సీజన్లో పాల్గొన్న పునర్నవి హౌజ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌లో నడిపిన ప్రేమ కహాని గురించి అందరికి తెలిసిందే. హౌజ్‌లో వీరిద్దరి రిలేషన్ చాలా ఆసక్తిగా ఉండేది. దీంతో బిగ్‌బాస్ కూడా వారి రిలేషన్‌కు మరింత మసాలా జోడిస్తూ టాస్క్‌లు ఆడించేవారు. బయటకు వచ్చాకా కూడా పలు ఈవెంట్స్‌లో వీరిద్దరినే ఫోకస్ చేసేవారు. అందంతా చూసి అంతా పునర్నవి, రాహుల్ రిలేషన్లో ఉన్నారని నమ్మేశారు. కానీ కొద్ది రోజులుగా వారి రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది. బిగ్‌బాస్ తర్వాత ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుందనుకుంటే.. నటనకు ఫుల్స్టాప్ పెట్టి ఫారెన్ వెళ్లింది. ప్రస్తుతం యూకేలో హయ్యర్ స్టడిస్ చేస్తున్న పునర్నవి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తుంది.