Gautham Krishna: ‘బిగ్‌బాస్‘ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్‘ మూవీ, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
Gautham Krishna: ‘బిగ్ బాస్‘ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
![Gautham Krishna: ‘బిగ్‌బాస్‘ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్‘ మూవీ, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ Big Boss Gautham Krishna‘Solo Boy’ Movie First Look Out Gautham Krishna: ‘బిగ్‌బాస్‘ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్‘ మూవీ, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/ef08c268691929b694fe85b4d43bcdb51707292330918544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gautham Krishna Solo Boy Movie First Look: ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చాక, నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొని చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్న పలువురు కంటెస్టెంట్లు హీరోలుగా రాణిస్తున్నారు. వెండితెరపై చక్కటి నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన మరెవరో కాదు గౌతమ్ కృష్ణ.
గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
గౌతమ్ కృష్ణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి ఆట తీరుతో అందరినీ అలరించాడు. తాజాగా ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. ‘సోలో బాయ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నూతన దర్శకుడు పి నవీన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లవ్ కమ్ ఫ్యామిలీ జోనర్ లో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళీ, అనిత చౌదరి, షఫీ, ఆనంద్ చక్రపాణి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
View this post on Instagram
అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయబోతున్న తోటి ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్
‘సోలో బాయ్’ సినిమాను సెవెన్ హిల్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన బట్టల రామస్వామి బయోపిక్కు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు జుడా సందే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 7లో గౌతమ్ కృష్ణతో పాటు కంటెస్టెంట్ గా ఉన్న ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకు ఆయనే కొరియోగ్రఫీ చేయబోతున్నారు.
డాక్టర్ నుంచి యాక్టర్ గా మారిన గౌతమ్ కృష్ణ
ఇక గౌతమ్ కృష్ణ నిజానికి వృత్తిపరంగా డాక్టర్. ఎంబీఏ కూడా కంప్లీట్ చేశారు. అయితే, ఆయనకు నటన పట్ల మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో సినిమాల్లోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో సుమారు 13 వారాలు పాటు కొనసాగారు. చక్కటి ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై మరోసారి హీరోగా ఆకట్టుకోబోతున్నాడు.
Read Also: జవాన్లను చంపితే JNUలో సంబరాలా? ‘బస్తర్’ టీజర్‌లో నిప్పులు చెరిగిన ఆదాశర్మ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)