Bharathiraja: ఆస్పత్రిలో భారతీరాజా... ఆయనకు ఏమైంది? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
Bharathiraja Hospitalised: కుమారుడు మనోజ్ మరణం తర్వాత మలేషియాలోని కుమార్తె ఇంటికి వెళ్లారు భారతీరాజా. డిసెంబర్ నెలలో ఆయన చెన్నై వచ్చారు. ఇటీవల అనారోగ్యం పాలయ్యారు.

Bharathiraja Health Condition Today: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
వయసు పైబడటంతో భారతీరాజాకు ఇబ్బందులు
తమిళ సినిమా '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో శ్రీదేవి ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు రాఘవేంద్ర రావు) చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు భారతీరాజా. తమిళ సినీ అభిమానులు ఆయన్ను నేటికీ 'దర్శక దిగ్గజం'గా కీర్తిస్తారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన భారతీరాజా... తమిళనాడులోని తేని అల్లి నగరానికి చెందినవారు. స్టూడియోలలో కాకుండా తమిళ సినిమాలను సహజమైన ప్రదేశాలలో చిత్రీకరించడానికి ఆయన ప్రేరణగా నిలిచారు.
ప్రస్తుతం భారతీరాజా వయసు 84 ఏళ్లు. ఈ వయసులోనూ... గత ఏడాది మార్చి నెలకు ముందు వరకు ఆయన చురుకుగా పని చేసేవారు. అయితే... కుమారుడు, నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీరాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన మానసిక వేదన, వయసు పైబడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
Also Read: పరాశక్తి బ్యానర్లు చింపేసిన దళపతి విజయ్ ఫ్యాన్స్... తమిళనాడులో సంక్రాంతి రిలీజులు రగడ
ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో...
మనోజ్ మరణం తర్వాత మలేషియాలోని తన కుమార్తె ఇంట్లో నివసిస్తున్న భారతీరాజా ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చారు. డిసెంబర్ చివరిలో ఆయనకు అనారోగ్యం చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు నిరంతర చికిత్స అందిస్తున్న సమయంలో భారతీరాజా ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడం ప్రారంభించాయి.
இயக்குநர் பாரதிராஜா அவர்கள் நலமுடன் தான் உள்ளார். #Bharathiraja pic.twitter.com/Txpw5pEW9s
— Harish M (@chnmharish) January 3, 2026
అయితే, ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో భారతీరాజా చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కుటుంబ సభ్యుల ద్వారానే తెలియచేస్తామని, కాబట్టి ఎలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు.
Also Read: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'క్రైమ్ పరంపర' చట్టాన్ని కేంద్రంగా చేసుకుని 'ఆగోల్' నవల సిరీస్‌లోని మూడవ భాగమైన 'నితిలన్ వాక్కుమూలం' అనే పుస్తకాన్ని కపిలన్ వైరముత్తు రచించగా... దానిని భారతీరాజా విడుదల చేశారు. ఈ సమయంలో భారతీరాజా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, చికిత్సకు భారతీరాజా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?





















