By: ABP Desam | Updated at : 18 Mar 2023 03:24 PM (IST)
భాను శ్రీ మెహ్రా (Image Courtesy : mehrabhanushree / Instagram)
మీకు హీరోయిన్ భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) గుర్తు ఉన్నారా? పేరు చెబితే ఎవరికీ ఐడియా ఉండకపోవచ్చు. పేరు చెప్పకుండా 'వరుడు' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించిన అమ్మాయి అని చెబితే ఎక్కువ మంది గుర్తు పట్టవచ్చు. తొలి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరో అవకాశం రావడానికి రెండేళ్లు టైమ్ పట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. మెయిన్ హీరోయిన్ రోల్స్ ఆమెకు ముఖం చాటేశాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఎందుకు? అంటే... అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
నన్ను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు! - భాను శ్రీ మెహ్రా
ట్విట్టర్ వేదికగా శనివారం సంచలనానికి భాను శ్రీ మెహ్రా తెర తీశారు. అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారంటూ ఆమె ట్వీట్ చేశారు. తాను అల్లు అర్జున్ 'వరుడు'లో యాక్ట్ చేశానని, ఆ తర్వాత ఇప్పటి వరకు తనకు పని లేదని ఆమె పేర్కొన్నారు. కష్టాల్లో సంతోషాన్ని వెతుకుతూ ఉంటానని, తన యూట్యూబ్ ఛానల్ సబ్‌స్కైబ్ చేసుకోమని భాను శ్రీ మెహ్రా కోరారు.
అసలు కథంతా యూట్యూబ్ దగ్గరే ఉంది!
కథానాయికగా, నటిగా భాను శ్రీ మెహ్రాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమెకు పని లేదు. ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో వీడియోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ సోషల్ మీడియాలో షేర్ చేయడం... ఆ లింక్స్ అల్లు అర్జున్, ఇతర హీరోలకు ట్యాగ్ చేస్తున్నారు. ప్రతిసారీ వీడియో లింక్స్ ట్యాగ్ చేసి ఉండటంతో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భాను శ్రీని తిట్టిన నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్!
ట్విట్టర్ ఉందని ప్రతి వీడియో ట్యాగ్ చేస్తూ ఉంటే బ్లాక్ చేయడా? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భాను శ్రీ మెహ్రా తీరును ఎండగట్టడం స్టార్ట్ చేశారు. కొంత మంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఎటాక్ చేశారు. ఆమె కూడా ఏమీ ఊరుకోలేదు. తనను కిందకు లాగాలని ఎవరు ప్రయత్నించినా తగ్గనని బదులు ఇచ్చారు.
Step 1,
— Ponile Mowa (@ponilemova) March 18, 2023
Spam Yt links everywhere to everyone
Step 2,
Get blocked by everyone,
Step 3,
Use the only film you got recognition from and the actor you've acted with to play out a reach stunt to promote your lame channel pic.twitter.com/EKP6GDLCUl
అన్ బ్లాక్ చేసిన అల్లు అర్జున్!
రెండు గంటల పాటు భాను శ్రీ మెహ్రాను అల్లు అర్జున్ బ్లాక్ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ తనను అల్లు అర్జున్ అన్ బ్లాక్ చేశాడని భాను శ్రీ మరో ట్వీట్ చేశారు. తన కెరీర్ విషయంలో ఆయన్ను ఎప్పుడూ బ్లేమ్ చేయలేదని, తనకు సపోర్ట్ చేస్తున్నందుకు బన్నీకి థాంక్స్ అని ఆమె పేర్కొన్నారు. అదీ సంగతి!
Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?
Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I've learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun pic.twitter.com/oLovQdnWAE
— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023
'వరుడు' తర్వాత 'డింగ్ డాంగ్ బెల్' అని భాను శ్రీ మెహ్రా ఓ సినిమా చేశారు. ఆ తర్వాత 'అలా ఎలా'లో 'వెన్నెల' కిశోర్ జోడీగా కనిపించారు. రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే', శర్వానంద్ 'రన్', కీర్తీ సురేష్ 'మిస్ ఇండియా' సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేశారు. కెరీర్ ఫెడవుట్ కావడంతో పబ్లిక్ అటెన్షన్ కోసం భాను శ్రీ మెహ్రా ఈ విధంగా చేస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.
Also Read : మహేష్ సినిమాలో జయరామ్ - హీరో లుక్ లీక్ చేశారుగా!
Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
SSMB 28 Title : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్