Bedurulanka 2012 Song : మణిశర్మ సంగీతంలో 'బెదురులంక 2012' - రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. ఇందులో రెండో పాటను త్వరలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అది ఎప్పుడంటే?
'ఆర్ఎక్స్ 100' కార్తికేయ (Kartikeya Gummakonda) కథానాయకుడిగా, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. దీంతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
'బెదురులంక 2012' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల్లో ఆడపిల్ల...' అంటూ సాగే తొలి పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నారు.
జూలై 19న 'సొల్లుడా శివ' సాంగ్!
Solluda Siva Song : 'బెదురులంక 2012' సినిమాలో రెండో పాట 'సొల్లుడా శివ'ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆ రోజు సాయంత్రం సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానల్‌లో సాయంత్రం ఐదు గంటలకు సాంగ్ రిలీజ్ కానుంది.
Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
Bringing you a free-spirited soul from the times back in #Bedurulanka2012 😎
— Kartikeya (@ActorKartikeya) July 16, 2023
Ask him!
Nuvvevadivi... #SolludaSiva ?
Full song ready to stream on 19th July 5PM 💥@iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/ddz0Moo7Ct
ఆగస్టులో 25న థియేటర్లలో 'బెదురులంక'
Bedurulanka 2012 Release Date : వచ్చే నెలలో 'బెదురులంక 2012' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read : తమన్ ఆ పాటను కాపీ కొట్టారా? 'జాణవులే'పై ఫ్యాన్స్ ట్రోల్స్
రూరల్ డ్రామాల్లో బెంచ్ మార్క్!
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన చెప్పారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial