Bedurulanka 2012 Song : భోగమంత యిడువనే యిడువవు, లోకమన్న లెక్కలకు అందవు - నువెవడివి?
కార్తికేయ హీరోగా నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012'లో కొత్త పాటను నేడు విడుదల చేశారు.
'ఆర్ఎక్స్ 100' కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012' (Bedurulanka 2012 Movie). క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో 'సొల్లుడా శివ' పాటను ఈ రోజు విడుదల చేశారు.
నువెవడివి? సొల్లుడా శివా!
''భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా...
నువెవడివి సొల్లుడా శివా... నువెవడివి సొల్లుడా శివా...
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా...
నువెవడివి సొల్లుడా శివా... నువెవడివి సొల్లుడా శివా...''
అంటూ ఈ గీతం సాగింది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాంచి బాణీ అందించగా... 'సొల్లుడా శివా' పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు. లిరికల్ వీడియో చూస్తే... కార్తికేయ హుషారుగా స్టెప్పులు వేసినట్లు అర్థం అవుతోంది. అలాగే, లిరిక్స్ ద్వారా పాటకు ఫిలాసఫీ టచ్ కూడా ఇచ్చారు. ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 'వెన్నెల్లో ఆడపిల్ల...' కూడా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుందని చెప్పారు.
Also Read : త్రివిక్రమ్ కథతో రానా 'హిరణ్యకశ్యప' - హాలీవుడ్ గడ్డపై ప్రకటన
ఆగస్టులో 25న థియేటర్లలో 'బెదురులంక'
Bedurulanka 2012 Release Date : వచ్చే నెలలో 'బెదురులంక 2012' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!
రూరల్ డ్రామాల్లో బెంచ్ మార్క్!
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన చెప్పారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial