Balakrishna: మ్యాన్షన్ హౌస్... బాలకృష్ణ... ఇప్పుడు డైరెక్ట్ ప్రమోషన్
Balakrishna's Mansion House Advertisement: మ్యాన్షన్ హౌస్ సంస్థకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త యాడ్ వచ్చింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త యాడ్ చేశారు. ఓ పాపులర్ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన బ్రాండ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఆయన కొన్ని యాడ్స్ చేసినా... ఇది మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి. బాలయ్య చేసిన కొత్త యాడ్ తాజాగా విడుదల చేశారు.
మ్యాన్షన్ హౌస్... బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ!
బాలకృష్ణకు ఇష్టమైన డ్రింకింగ్ బ్రాండ్ ఏది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా వెళ్లినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ (Mansion House) తీసుకుని వెళతారని చిన్న అల్లుడు భరత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని సినిమాల్లో మ్యాన్షన్ హౌస్ - బాలకృష్ణ మీద డైలాగులు కూడా పడ్డాయి. అయితే ఎప్పుడూ దాని గురించి బాలయ్య తన నోటి వెంట చెప్పింది లేదు.
ఆహా తెలుగు ఓటీటీలో 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి బాలకృష్ణ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ షోకి మ్యాన్షన్ హౌస్ అడ్వర్టైజింగ్ పార్ట్నర్. అప్పుడు మొదటిసారి బాలయ్య నోటి వెంట మ్యాన్షన్ హౌస్ అని వచ్చింది. ఇప్పుడు డైరెక్టుగా ఆ సంస్థకు ఆయన ప్రచారం చేస్తూ ఒక వాణిజ్య ప్రకటన చేశారు.
'వెల్ కమింగ్ సూన్ టు యువర్ ఫేవరెట్ హౌస్' అంటూ మ్యాన్షన్ హౌస్ ఒక యాడ్ చేసింది. ఆ వీడియోలో 'వన్స్ ఐ స్టెప్ ఇన్...' (హిస్టరీ రిపీట్స్) అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. అయితే... బాలకృష్ణ చేసింది మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ యాడ్.
Balayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16
— NBK Cult (@iam_NBKCult) May 15, 2025
Balakrishna Upcoming Movies: బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే... బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆ సినిమా గ్లింప్స్ లేదా టీజర్ విడుదల కానుంది. ఆ తర్వాత 'వీరసింహా రెడ్డి' వంటి హిట్ తీసిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు. 'జైలర్ 2'లో అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. తమిళ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వినికిడి.
Also Read: యాంగ్రీ మ్యాన్‌తో విజయ్ దేవరకొండ 'ఢీ'... యంగ్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్... విలన్ రోల్ కన్ఫర్మ్





















