By: ABP Desam | Updated at : 09 Mar 2023 09:19 AM (IST)
కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, ఎన్టీఆర్
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు అరుదు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమా కంటే ముందు కొన్ని మల్టీస్టారర్స్ వచ్చాయి. అయితే, ఆ సినిమాల్లో ఒక సీనియర్ స్టార్ హీరో, మరో యంగ్ స్టార్ కలిసి నటించారు. ప్రజెంట్ టాలీవుడ్ టాప్ యంగ్ స్టార్ హీరోలు ఎవరూ కలిసి మల్టీస్టారర్ చేయలేదు. ఒక విధంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన క్రేజీ మల్టీస్టారర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు తెలుగులో ఫ్యామిలీ మల్టీస్టారర్స్ కొన్ని వస్తున్నాయి.
కొణిదెల, అక్కినేని మల్టీస్టారర్స్ వచ్చేశాయ్
సినిమా రిజల్ట్ పక్కన పెడితే కొణిదెల ఫ్యామిలీ మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. గురు శిష్యులుగా కనిపించారు.
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 'మనం'లో మూడు తరాల హీరోలు కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య కలిసి నటించారు. అతిథి పాత్రలో అఖిల్ మెరిశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాల్లో తండ్రీ కుమారులు నాగార్జున, నాగచైతన్య నటించారు. ఇప్పుడు నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ ప్లానింగులో ఉందని టాలీవుడ్ టాక్.
ఓటీటీలో దగ్గుబాటి మల్టీస్టారర్
Rana Naidu Web Series : విక్టరీ వెంకటేష్, ఆయన అన్నయ్య కుమారుడు రానా నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. దగ్గుబాటి హీరోలు కలిసి నటించడం ఇదే తొలిసారి. తెలుగులో వస్తున్న ఫ్యామిలీ మల్టీస్టారర్స్ అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఒక్క నందమూరి అభిమానులకు తప్ప! అందుకని, వాళ్ళు బాబాయ్ - అబ్బాయ్ మల్టీస్టారర్ కోసం వెయిట్ చేస్తున్నారు.
బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించేది ఎప్పుడు?
నట సింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఉందని నందమూరి అభిమానులు చెబుతున్నారు. తమ కోరిక తీరేది ఎప్పుడో అని వెయిట్ చేస్తున్నారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటిస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు.
బాలకృష్ణతో కలిసి కళ్యాణ్ రామ్ నటించారు. 'ఎన్టీఆర్' బయోపిక్‌లో తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించారు. కళ్యాణ్ రామ్ కూడా ఆయన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు. వాళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో ఒక్క మల్టీస్టారర్ సినిమాలు చేసినా... నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నటించినా బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో? వెయిట్ అండ్ సి!
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
ప్రస్తుతం నందమూరి హీరోలు అందరూ తమ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వినికిడి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కోసం ఎన్టీఆర్ చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు. ఆ తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఓకే చేశారు. కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా చేస్తున్నారు.
Also Read : 'కెజియఫ్' కామెంట్స్ గొడవ - వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?
RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!
Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా