అన్వేషించండి

Balakrishna New Movie : బాలకృష్ణ సినిమాకు భారీ బడ్జెట్ - మినిమమ్ వంద కోట్లు టార్గెట్?

నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన కొత్త సినిమాకు నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఖర్చు విషయంలో రాజీ పడకూడదని ముందే నిర్ణయించుకున్నారట.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు సాలిడ్ హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందనేది 'అఖండ' చూపించింది. ఆ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు వచ్చాయి. అందుకని, ఆయన సినిమాకు భారీగా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హీరోగా ఆయన 108వ సినిమా ఇది. అందుకని, NBK 108ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు 90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాలు అన్నిటిలోనూ ఆయన డ్యూయల్ రోల్స్ చేశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం ఆయనది సింగిల్ రోల్. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
  
టార్గెట్ వంద కోట్లు!
90 కోట్లు ఖర్చు చేస్తే... మినిమమ్ వంద కోట్ల బిజినెస్ జరగాలి. డిస్ట్రిబ్యూటర్లకు అంత కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు ప్రేక్షకుల్లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ చూస్తే... వంద కోట్లు రావడం పెద్ద విషయం కాదు. బాలయ్యకు తోడు అనిల్ రావిపూడి కూడా సూపర్ డూపర్ హిట్ ట్రాక్‌లో ఉన్నారు. అందువల్ల, నిర్మాతలు ధైర్యంగా ఖర్చు చేస్తున్నారని చెప్పవచ్చు.  
సెట్ వర్క్ షురూ...డిసెంబర్ 8న షూట్!ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా సెట్ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా, శరవేగంగా జరుగుతోంది. సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. డిసెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విలన్‌గా అర్జున్ రాంపాల్...
హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా!  
ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్‌కు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఆల్రెడీ ఆయనకు బాలయ్య ఓకే చేయడం... అర్జున్ రాంపాల్ కథ విని ఓకే చేయడం జరిగాయట. కథానాయికగా సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పేరు పరిశీలనలో ఉందట. త్వరలో ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో కొన్ని చిత్రాలకు బాలకృష్ణ సరసన కథానాయికగా సోనాక్షి పేరు వినిపించింది. కానీ, ఓకే కాలేదు. ఈసారైనా ఓకే అవుతుందో? లేదో? చూడాలి.  

Also Read : హ్యాపీ బర్త్ డే విష్ణు మంచు - ప్రేమించినా సరే, ద్వేషించినా సరే ఆయన్ను మాత్రం వదల్లేరు!

తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' విడుదల కానుంది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' సెట్స్ మీదకు వెళ్ళనుంది.  

ఈ వారమే 'అన్‌స్టాప‌బుల్‌ 2' నాలుగో ఎపిసోడ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ కథానాయిక రాధికా శరత్ కుమార్ అతిథులుగా వచ్చిన 'అన్‌స్టాప‌బుల్‌ 2' నాలుగో ఎపిసోడ్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రాత్రి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget