By: ABP Desam | Updated at : 04 Jun 2023 04:08 PM (IST)
ఆశిష్ విద్యార్థి(Photo Credit: Social Media)
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశిష్ విద్యార్థి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాకు మూడు ముళ్లు వేశారు. మే 25న తమ సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు. తాజాగా తన తొలి భార్యతో కలిగిన కొడుకు గురించి చాలా విషయాలు వెల్లడించారు.
తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఆ విషయాన్ని అబ్బాయి ఆర్త్ తో చెప్పడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తనకు చెప్పడానికి ఎంతో కష్టపడినట్లు వెల్లడించారు. "చాలా గిల్టీగా అనిపించించింది. నేను, పిలూ(రాజోషి) ఇద్దరూ అతడికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకోలేదు. మేము ఇద్దరం కొంత కాలంగా గొడవలతో ప్రయాణం చేశాం. కలిసి ఉండటం వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని భావించాం. అది మా ఇద్దరి జీవితాలతో పాటు అబ్బాయి ఆర్త్ మీద కూడా బాగా ప్రభావం చూపుతుందని నిర్ణయానికి వచ్చాం. పేరెంట్స్ చాలా గొడవలతో ఇబ్బంది పడుతున్నారు అనే విషయం ఆర్త్ కు కూడా తెలుసు. ఒక్కోసారి పరిస్థితి ముదిరేకొద్ది తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటూ కొట్లాడుకోవడం కంటే, విడిపోయి సుఖంగా ఉండటం మంచిది అనుకున్నాం. మా మూలంగా అబ్బాయి జీవితం చెడిపోకూడదు అనుకున్నాం. ఇదే విషయాన్ని అబ్బాయికి చెప్పాం. విడిపోతున్నామని తనకు అర్థం అయ్యేలా వివరించాం. అతడు కూడా మా నిర్ణయానికి అంగీరం చెప్పాడు” అని ఆశిష్ చెప్పుకొచ్చారు.
ఇప్పటికే తన మొదటి భార్య పీలూ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. తన మాజీ భార్య పిలూ నుంచి విడిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆమెతో విడాకుల నిర్ణయం అంత తేలికగా జరగలేదన్నారు. విడాకులు నిర్ణయం రాత్రికి రాత్రి జరిగింది కాదన్నారు. “నేను ఆమెను ద్వేషించలేను. పిలూ, నేను చాలా కాలం చక్కటి వివాహ బంధాన్ని కొనసాగించాం. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పిలూను ఎప్పుడూ ఓ ఫ్రెండ్ గానే చూశాను. ఆమెతో విడిపోవడం చాలా బాధను కలిగిస్తోంది. ఆమెను, నా కొడుకు మోగ్లీని వదులుకోవడం చాలా కష్టం అనిపించింది” అని చెప్పుకొచ్చారు.
తన రెండో పెళ్లి గురించి పలు విషయాలు వెల్లడించారు ఆశిష్ విద్యార్థి. అసలు తాను రెండో వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. ఆశిష్ పెళ్లి తర్వాత పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆశిష్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న తన మొదటి భార్య, ఆయనకు దూరంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, రూపాలిని తాను ఎలా కలిశాడో చెప్తూ ఆశిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఓ వీడియోను పోస్టు చేశారు. రూపాలికి ఇప్పటికే పెళ్లై భర్తను కోల్పోయిందని వివరించారు. “నేను ఎవరో ఒకరితో ప్రయాణం చేయాలనుకున్నాను. అలా అనుకుంటున్న నాకు ఏడాది క్రితం రూపాలి బారువా కలిసింది. మేము భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాం. అందులో భాగంగానే పెళ్లి చేసుకున్నాం” అని వివరించారు.
Read Also: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?
Rakshit Shetty: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి
వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>