AR Rahman: ఆ కారణంతోనే లెస్బియన్ చిత్రం ‘ఫైర్’కు సంగీతం అందించా: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చిత్ర ‘ఫైర్’ 1998లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏఆర్ రెహమాన్.. భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మేటి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సంగీతం అందించి ఎన్నో చిత్రాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అలా హిట్ అయిన సినిమాల్లో ‘ఫైర్’ కూడా ఒకటి. ఇస్మత్ చుగ్తాయ్ రాసిన చిన్న కథ ‘లిహాఫ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. లెస్బియన్ మూవీని తెరకెక్కింది. 1998లో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది.
మానత్వానికి అండగా నిలిచాను
తాజాగా ఈ సినిమా గురించి ఓ సమావేశంలో రెహమాన్ ప్రస్తావించారు. ఆ సినిమాకు సంగీతాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తన వ్యక్తిగత విలువలకు, ఈ సినిమాకు సంబంధం ఏంటి? అనే పలు విషయాల గురించి ఆయన వివరించారు. “నిజం చెప్పాలంటే ‘ఫైర్’ అనే సినిమా ఒక లెస్బియన్ మూవీ. నా వ్యక్తిగత విలువలకు సంబంధించిన చిత్రం కానే కాదు. అయినప్పటికీ మానవత్వంతో ఆ సినిమాకు సపోర్టుగా ఉన్నాను. ఎవరైనా అణిచివేతకు గురైనప్పుడు, మెయిన్ స్ట్రీమ్ నుంచి ఓ పక్కకు నెట్టివేయబడినప్పుడు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా నాకు అనిపించిన చిత్రమే ‘ఫైర్’. అందుకే, ఈ సినిమాకు సంగీతం అందించాలి అనుకున్నాను. అందించాను. సక్సెస్ అయ్యాను” అని రెహమాన్ వివరించారు.
"నా ఇల్లు ఒక మురికివాడ పక్కనే ఉంది. అన్ని రకాల మనుషులను గమనించాను. నేను అన్ని రకాల సినిమాలు చూశాను. ప్రొఫెషనల్‌గా ఏ విషయాన్ని ఎదుర్కోవాలనేది నాకు తెలుసు. "వ్యక్తిగత ఎంపికగా నేను నిలబడేది వేరు. వృత్తి పరమైన విషయాలు వేరు. వాస్తవానికి ఫైర్ అనే లెస్బియన్ మూవీ నా వ్యక్తిగత నిబంధనలకు వ్యతిరేకం. కానీ, నేను వృత్తిపరంగా మద్దతుగా నిలిచాను. నా తాజా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్2’లో హత్యలు సహా అన్ని విషయాలు ఉన్నాయి. కానీ అది చరిత్ర. దానిని ఎవరూ మార్చలేరు” అని చెప్పుకొచ్చారు.
సంచలన విజయం సాధించిన ‘ఫైర్’
1996లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఫైర్’ సినిమాను విడుదల చేశారు. ఇందులో పాటలు లేవు. 16 ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్స్ ఉన్నాయి. వాటిలో 14 ట్రాక్స్ ను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఈ చిత్రంలో నందితా దాస్, షబానా అజ్మీ నటించారు. లెస్బియన్ రిలేషన్‌షిప్ కు సంబంధించి తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా ‘ఫైర్’ గుర్తింపు తెచ్చుకుంది.
ఈ నెల 28న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’కు సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, రవి, కార్తీ, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Read Also: మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు సమంత - అలా మాట్లాడటం అవసరమా అంటూ నెటిజనులు ఆగ్రహం