Ante Sundaraniki Box Office Collection: అంటే... నాని సుందరానికీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Ante Sundaraniki Movie Box Office collection First Day In AP, Telangana: నాని లేటెస్ట్ సినిమా 'అంటే సుందరానికీ' శుక్రవారం విడుదలైంది. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే...
నాని, నజ్రియా నజీమ్ ఫహాద్ జంటగా నటించిన సినిమా 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. అనుపమా పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలైంది.
'అంటే సుందరానికీ' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ వచ్చింది. థియేటర్లలో చూసిన వారు బావుందంటూ పోస్టులు చేశారు. అయితే, వసూళ్లు మాత్రం ఆశించిన రీతిలో లేవు. కొంచెం తక్కువ వచ్చాయనేది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 'అంటే సుందరానికీ' సినిమాకు 3.79 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణ ఏరియాల్లో 'అంటే సుందరానికీ' కలెక్షన్స్ (షేర్)
నైజాం - రూ. 1.55 కోట్లు
సీడెడ్ - రూ. 40 లక్షలు
నెల్లూరు - రూ. 18 లక్షలు
గుంటూరు - రూ. 34 లక్షలు
కృష్ణా జిల్లా - రూ. 28 లక్షలు
తూర్పు గోదావరి - రూ. 25 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 34 లక్షలు
ఉత్తరాంధ్ర - రూ. 45 లక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో: రూ. 03.79 కోట్లు (ఇది షేర్ కలెక్షన్స్. గ్రాస్ ఎక్కువ ఉంటుంది)
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
'అంటే సుందరానికీ' సినిమాలో నదియా, నరేష్, రోహిణీ, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో వినోదాత్మక సన్నివేశాలకు మంచి పేరొచ్చింది.
Also Read: చీకటిని వణికించే అస్త్రం, వెయ్యి నందుల బలం - 'బ్రహ్మాస్త్ర'లో అనీష్ శెట్టిగా కింగ్ నాగార్జున
View this post on Instagram