Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు, మరో డీప్ ఫేక్ వీడియో వైరల్!
హీరోయిన్ రష్మిక మందన్నను డీప్ ఫేక్ కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ఆమెకు సంబంధించిన మరో ఫేక్ వీడియోను క్రియేట్ చేసి, సోషల్ మీడియాలోకి వదిలారు.
![Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు, మరో డీప్ ఫేక్ వీడియో వైరల్! another deep fake video of rashmika goes viral in social media Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు, మరో డీప్ ఫేక్ వీడియో వైరల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/fc9d384d9dcca3f45121d87c2f4548861699611774938544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు డీప్ ఫేక్ తిప్పలు తప్పడం లేదు. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలం కలిగించింది. ఆ వీడియోను మర్చిపోక ముందే మరోసారి ఆమెను టార్గెట్ చేశారు. తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. ఈ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని, ఎవరూ నమ్మకూడదని పోస్టులు పెడుతున్నారు. రష్మికను కావాలని కొందరు టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆమెను డీఫేమ్ చేయడానికి ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన అభిమానులు మండిపడుతున్నారు.
Another Deep Fake Video of Rashmika Mandanna viral on Instagram, Youtube and Facebook.#Deepfake #RashmikaMandanna pic.twitter.com/JBWT2C8Xyi
— Mr Reaction Wala (@MrReactionWala) November 9, 2023
సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ఆగంతకులు
కొంత మంది దుండగులు సెలబ్రిటీలే టార్గెట్ గా మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని యాడ్ చేసి ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రష్మిక వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతి రోజునే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ డీప్ ఫేక్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ‘టైగర్ 3’ సినిమాలోని టవల్ ఫైట్ ఫోటోను తీసుకుని, లో దుస్తుల్లో ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు.
డీప్ ఫేక్ వ్యవహారంపై ప్రముఖుల ఆగ్రహం
ఈ డీప్ ఫేక్ వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమితాబ్ బచ్చన్, కీర్తి సురేష్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై సీరియస్ అయ్యింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేక్ వీడియోలను తమ ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అటు తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఆవేదనతో పాటు ఆందోళన వ్యక్తం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరో ఫేక్ వీడియో వైరల్ కావడం ఇండస్ట్రీని కలవర పాటుకు గురి చేస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సినీ జనాలు గట్టిగా కోరుతున్నారు. లేదంటే మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు.
వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేక్ వీడియోలను రూపొందించే అవకాశం ఉంది. అచ్చం ఒరిజినల్ వీడియో మాదిరిగానే భ్రమ పడేలా ఫేక్ వీడియోలను క్రియేట్ చేయవచ్చు. అయితే, తాజాగా వస్తున్న డీప్ ఫేక్ వీడియోల నేపథ్యంలో ఈ టెక్నాలజీని మిస్ యూజ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)