Game Changer: చరణ్‌కే కాదు, అంజలికీ నేషనల్ అవార్డు... క్రేజీ అప్డేట్స్ ఇస్తూ 'గేమ్ ఛేంజర్'పై హైప్ పెంచేసిన తమన్
Game Changer: 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటనకు గానూ అంజలి నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయం అంటూ తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి (Anjali), శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన 50వ సినిమా కూడా ఇదే. కాగా 2025 జనవరి 10న 'గేమ్ ఛేంజర్' మూవీని రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా తమన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిట్ చాట్ లో పాల్గొని, అభిమానులు అడిగిన పలు విషయాలకు సమాధానం చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
మరో రెండు పాటలు రాబోతున్నాయి
ఇక ఈ చిట్ చాట్ లో తమన్ 'గేమ్ ఛేంజర్' నుంచి మరో రెండు పాటలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి అని వెల్లడించారు. తమన్ మాట్లాడుతూ "గేమ్ ఛేంజర్ మూవీ అన్ని విషయాల్లోనూ భారీ చిత్రమే. ఈ సినిమాకు సంబంధించిన పాటలన్నింటిని 2021 డిసెంబర్ లోపే కంప్లీట్ చేశాను. శంకర్ సినిమాకు ఇంత వేగంగా పాటల కంపోజింగ్ పూర్తవుతుందని నేను ఊహించలేదు. కాకపోతే అవి లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాం. ఇక ఈ పాటల చిత్రీకరణ విషయంలో శంకర్, నిర్మాత దిల్ రాజు ఎక్కడా కూడా రాజీ పడకుండా చిత్రీకరించారు. ఇక 'జరగండి జరగండి' పాట అయితే అద్భుతంగా ఉంటుంది. కళ్ళజోడు లేకుండానే 3D సినిమాను చూసిన ఫీలింగ్ కలగజేస్తుంది. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అలాగే డ్యాన్స్ కు ప్రాధాన్యమున్న మరో బిట్ సాంగ్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది" అంటూ క్రేజీ అప్డేట్స్ ను షేర్ చేసుకున్నారు.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
అంజలికి నేషనల్ అవార్డు ఖాయం
ఇక ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ నటన హైలెట్ గా ఉంటుందని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎక్స్ స్పేస్ లో మాట్లాడిన తమన్ మాత్రం అంజలికి ఏకంగా నేషనల్ అవార్డు వస్తుందంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి తమన్ మాట్లాడుతూ "గేమ్ ఛేంజర్ మూవీతో శంకర్ తో కలిసి పని చేయాలన్న నా డ్రీమ్ నెరవేరింది. ఇక ఎడిటింగ్ విషయంలో ఈ సినిమా ద్వారా ఆయన కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతున్నారు. సినిమా సెకండ్ హాఫ్ అంతా రేసీగా ఉంటుంది. అలాగే రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్, అంజలి పాత్రలపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నేనైతే ఆ పాత్రలో నటించిన అంజలికి జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. ఇండియన్ 2 మూవీ రిజల్ట్ తో కాస్త నిరాశ పడ్డ శంకర్ 'గేమ్ ఛేంజర్'తో మాత్రం హిట్ కొట్టేస్తారు" అంటూ మెగా అభిమానుల్లో మరింత జోష్ పెంచారు.
Read Also : SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!