అన్వేషించండి

Anirudh Ravichander Kavya Maran Wedding: కావ్యతో అనిరుధ్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారా? ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?

Anirudh Kavya Maran Wedding Date: సన్ రైజర్స్ సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్యతో సంగీత సంచలనం అనిరుధ్ ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. వాళ్ళ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వదంతులు తీవ్రమవుతున్నాయి.
  • నవంబర్ రెండో వారంలో వివాహం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.
  • అనిరుధ్ బాబాయ్ పరోక్షంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చారు.
  • ఇద్దరూ అధికారికంగా ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ బాబాయ్ సైతం పరోక్షంగా ఆ మాట చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... వాళ్ళిద్దరి పెళ్ళి తేదీ ఖరారు అయ్యిందట. 

కావ్యతో అనిరుధ్ పెళ్ళి ఎప్పుడంటే?
కోలీవుడ్ వర్గాల కథనం ప్రకారం... నవంబర్ రెండో వారంలో కావ్యతో అనిరుధ్ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'జైలర్ 2'కు అనిరుధ్ సంగీత దర్శకుడు. ఆ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తర్వాత అనిరుధ్, కావ్య వివాహం జరిగే అవకాశం ఉంది.

గత ఏడాది నుంచి అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ప్రేమాయణం సాగుతోందని చెన్నై వర్గాలు నుంచి వినిపిస్తున్న సమాచారం. గతేడాది న్యూయార్క్ సిటీలో ఈ సెలబ్రిటీలు ఇద్దరూ జంటగా కనిపించడంతో ప్రేమ, పెళ్లి వార్తలకు మరింత ప్రచారం లభించింది. గతంలో ఇతర మహిళలతో ఇటువంటి ప్రేమ, పెళ్లి వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా పుకార్లను నమ్మవద్దని అనిరుధ్ కోరారు. సదరు పుకార్లపై స్పందించారు. అయితే... తాజా పరిణామాలు మళ్లీ వీళ్ళిద్దరి పెళ్ళి చర్చకు దారి తీశాయి.

Also Read: Vishnu Priya Bhimeneni - సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

అనిరుధ్ రవిచందర్ బాబాయ్, కోలీవుడ్ నటుడు వై.జి. మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'అనిరుధ్ పెళ్లి త్వరలో జరుగుతుంది' అని హింట్ ఇచ్చారు. ఆ ఒక్క మాట చెప్పారు తప్ప... పెళ్ళి కుమార్తె ఎవరు? అనే విషయాన్ని చెప్పలేదు. తమ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పేరును అధికారికంగా వెల్లడించలేదు.

Also ReadArya Criminal Case - హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anirudh (@anirudhofficial)

ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన వెరీ వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తమిళనాడు సీఎం విజయ్ 'జన నాయకన్', రజనీ 'జైలర్ 2', లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న 'డిసి', న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్', శింబు 'అరసన్', బాలకృష్ణ 'ఎన్.బి.కె 112' తదితర చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. తమ పెళ్ళి గురించి అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ పెదవి విప్పడం లేదు. 

Also ReadRohit Chandel Arrested - మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్

Frequently Asked Questions

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఏమిటి?

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వారి వివాహ తేదీ కూడా ఖరారైనట్లు సమాచారం.

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి ఎప్పుడు జరగనుంది?

కోలీవుడ్ వర్గాల ప్రకారం, నవంబర్ రెండో వారంలో వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ 'జైలర్ 2' విడుదలైన తర్వాత వివాహం జరగవచ్చని సమాచారం.

అనిరుధ్, కావ్య మారన్ మధ్య ప్రేమాయణం ఎలా మొదలైంది?

గత ఏడాది నుంచి వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది న్యూయార్క్ సిటీలో వారు జంటగా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

వారి పెళ్లి గురించి ఎవరైనా అధికారికంగా ధృవీకరించారా?

అనిరుధ్ బాబాయ్ వై.జి. మహేంద్రన్ పెళ్లి గురించి హింట్ ఇచ్చారు కానీ, పెళ్లి కుమార్తె పేరు చెప్పలేదు. అనిరుధ్ గానీ, కావ్య గానీ పెళ్లి గురించి ఇంకా స్పందించలేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget