అన్వేషించండి

TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్

Rohit Chandel Arrested: రాజ్‌పాల్ యాదవ్‌కు మూడు నెలల జైలు శిక్ష వార్త హిందీ చిత్రసీమకు షాక్ ఇచ్చింది. అది మరువకముందు మరొక నటుడిని వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హిందీ టీవీ నటుడు రోహిత్ చందేల్ పోక్సో కేసులో అరెస్ట్.
  • పదహారేళ్ళ మైనర్ బాలికను వేధించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
  • బాలికకు ఫోన్లు, వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు.
  • ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరారు.

బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొంత మంది నటీనటులు చట్టపరమైన చిక్కుల్లో పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav)కు మూడు నెలల జైలు శిక్ష పడింది. అది మరువక ముందు మరొక నటుడు వేధింపుల కేసులో అరెస్ట్ కావడం సంచలనం అయ్యింది. హిందీ టీవీ యాక్టర్ రోహిత్ చందేల్ అరెస్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...

మైనర్ బాలికపై వేధింపులు...
పోక్సో కేసులో రోహిత్ అరెస్ట్!
Rohit Chandel Arrested Under POCSO: హిందీ సీరియళ్ళు చూసే తెలుగు ప్రేక్షకులకు రోహిత్ చందేల్ తెలిసి ఉండొచ్చు. 'కాశీబాయి బాజీరావు బల్లాల్', 'పాండ్యా స్టోర్', 'సైరాబ్' వంటి టీవీ సీరియల్స్‌లో మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై టీవీ ఇండస్ట్రీలో యాక్టర్ రోహిత్ చందేల్‌ పాపులర్. ఇప్పుడు ఆయనకు 19 ఏళ్ళు. పదహారేళ్ళ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినందుకు, అలాగే ఆమెను వెంబడించినందుకు రోహిత్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త హిందీ టీవీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Hrudayam Murali Review - 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ... అథర్వ, ప్రీతి ముకుందన్ సినిమా ఎలా ఉందంటే?

ముంబై పోలీసుల కథనం ప్రకారం... రోహిత్ చందేల్ మీద ముంబై ఈస్ట్ శివారు ప్రాంతానికి చెందిన బాలిక ఫిర్యాదు చేశారు. తనకు మొబైల్ నుంచి పదేపదే ఫోన్లు చేసేవాడని, వద్దని ఎంత చెప్పినా వినకుండా తరచూ వివిధ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసేవాడని, వేధించేవాడని మైనర్ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు... జూలై 5వ తేదీన తనను ఇంటి దగ్గరలో వెంబడించాడని, మైనర్ బాలిక ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషించాడని, అలాగే భౌతిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయితో రోహిత్‌కు ముందు నుంచి పరిచయం ఉన్నదని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

Also ReadAkhil Akkineni Lenin Review - 'లెనిన్' సినిమా రివ్యూ: అఖిల్ అక్కినేని సినిమా ఎలా ఉందంటే? హిట్టు కొట్టారా?

తనను వేధించాడని మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో రోహిత్ చందేల్‌ మీద 'పోక్సో - ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్' (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారుముంబై పోలీసులు. సెక్షన్ 78 (స్టాకింగ్), సెక్షన్ 115(2) కింద కూడా కేసులు నమోదు చేశారు. శుక్రవారం (జూలై 10న) ముంబైలోని దహిసర్‌ ప్రాంతంలో గల రోహిత్ చందేల్ నివాసంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పెషల్ పోక్సో కోర్టులో హాజరు పరిచారు. పోలీస్ కస్టడీకి  కోర్టు అనుమతించింది.

రోహిత్ చందేల్ యాక్టర్ మాత్రమే కాదు... క్రికెటర్ కూడా! మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది.

Also Read: Thamizh Murugan Vs God of War - ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?

Frequently Asked Questions

ఏ టీవీ నటుడు ఇటీవల అరెస్ట్ అయ్యారు?

ప్రముఖ హిందీ టీవీ నటుడు రోహిత్ చందేల్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఆయన 'కాశీబాయి బాజీరావు బల్లాల్', 'పాండ్యా స్టోర్' వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందారు.

రోహిత్ చందేల్ ఎందుకు అరెస్ట్ అయ్యారు?

పదహారేళ్ళ మైనర్ బాలికను వేధించినందుకు, వెంబడించినందుకు రోహిత్ చందేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.

రోహిత్ చందేల్‌ను ఏ చట్టం కింద అరెస్టు చేశారు?

మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 78 (స్టాకింగ్), సెక్షన్ 115(2) కింద కూడా కేసులు ఉన్నాయి.

రోహిత్ చందేల్ పై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ఆయన మైనర్ బాలికకు పదేపదే ఫోన్లు చేసి వేధించారని, ఇంటి దగ్గర వెంబడించి అసభ్యంగా దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget