అన్వేషించండి

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Animal Movie : సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ కోసం తన ఇంటిని త్యాగం చేశాడు ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో. ఈ విషయాన్ని తాజాగా నెటిజన్లు డీకోడ్ చేశారు.

Animal Movie House : సినిమాల్లో లొకేషన్స్ ఎప్పుడూ కథకు తగ్గట్టు ఉండాలని మేకర్స్ అనుకుంటూ ఉంటారు. అందుకే అలాంటి లొకేషన్స్ కోసం ఎంత దూరం అయినా వెళ్తుంటారు. ఒక్కొక్కసారి సినిమాకు, సీన్‌కు సెట్ అవ్వాలని షూటింగ్ కోసం తమ ఇంటినే ఇచ్చేస్తుంటారు నటీనటులు. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ కోసం తన తన ఇంటిని త్యాగం చేశాడట ఒక బాలీవుడ్ హీరో. ‘యానిమల్’లో రణబీర్ ఇల్లుగా చూపించిన ప్యాలెస్ పేరు పటౌడీ ప్యాలెస్. అయితే ఇది ఒక సీనియర్ బాలీవుడ్ హీరో ఇల్లు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అదే పటౌడీ ప్యాలెస్..
‘యానిమల్’ చిత్రంలో అనిల్ కపూర్.. ఒక పెద్ద బిజినెస్‌మ్యాన్ అవ్వడంతో తన ఫ్యామిలీతో పాటు ఒక పెద్ద ప్యాలెస్‌లో ఉంటాడు. అయితే ఈ ప్యాలెస్.. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిందని సమాచారం. పటౌడీ ప్యాలెస్‌లోనే ‘యానిమల్’కు సంబంధించిన పలు సీన్స్ షూట్ చేశారని నెటిజన్లు డీకోడ్ చేశారు. రణబీర్ కపూర్ సూట్ వేసుకొని ఒంటి నిండా రక్తంతో నడుచుకుంటూ వచ్చే షాట్‌లో ఈ ప్యాలెస్ మరింత క్లియర్‌గా కనిపిస్తుంది. హర్యానాలో ఉన్న ఈ పటౌడీ ప్యాలెస్‌లో ‘యానిమల్’ మాత్రమే కాదు.. మరెన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. 

బావమరిది కోసం బావ ఇల్లు..
పటౌడీ ప్యాలెస్‌లో ఇంతకు ముందుకు సైఫ్ అలీ ఖాన్ పలుమార్లు ఫోటోషూట్స్ చేశాడు. ఆ ఫోటోలను, ‘యానిమల్’లోని సీన్స్‌ను పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. ఇది కచ్చితంగా పటౌడీ ప్యాలెసే అని ఫిక్స్ అయిపోతున్నారు. హౌజ్ ఆఫ్ పటౌడీ అనే పేరుతో ఇప్పటికే ఈ ప్యాలోస్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడు సైఫ్ అలీ ఖాన్. ఇందులో ఆ ప్యాలెస్‌కు సంబంధించిన ఇంటీరియర్‌తో మరెన్నో పాటు మరెన్నో ఆకర్షణలు స్పష్టంగా చూపించారు. ఇక ఇప్పుడు తన బావమరిది రణబీర్ కపూర్ సినిమా షూటింగ్ కోసం బావ సైఫ్ అలీ ఖాన్ తన ఇంటినే త్యాగం చేశాడంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

పటౌడీ ప్యాలెస్ చరిత్ర..
సైఫ్ అలీ ఖాన్ తాత.. 1930ల్లో ఈ పటౌడీ ప్యాలెస్‌ను కట్టించారు. ఆయనే ఆ పటౌడీ సామ్రాజ్యానికి రాజు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ. ఈ ప్యాలెస్ విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. కొంతకాలం వరకు ఈ పటౌడీ ప్యాలెస్ బాధ్యత మొత్తం ఒక హోటల్ గ్రూప్ చేతిలో ఉందట. అయితే ఈ ప్యాలెన్స్ బాధ్యతలో వేరొకరి ఆధీనంలో కాకుండా తనే చూసుకుంటే బాగుంటుందని పలుమార్లు సైఫ్ అలీ ఖాన్.. తన కోరికను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ పటౌడీ ప్యాలెన్స్ ఎక్కువగా సినిమా షూటింగ్స్‌కు ఉపయోగపడుతోంది. ‘యానిమల్’ చిత్రంతో ఈ ప్యాలెస్ స్పెషల్ ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ తీసిన వైడ్ షాట్స్ అన్నీ ప్యాలెస్ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన మ్యాజిక్‌కు అందరూ ఫ్యాన్స్ అయిపోతున్నారు. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని ఎవరు చూస్తారులే అనుకున్న క్రిటిక్స్‌కు యానిమల్ సక్సెస్ షాకిచ్చింది. కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్’ రికార్డ్స్‌ను బద్దలుగొట్టుకుంటూ దూసుకుపోతోంది.

Also Read: CID సీరియల్ నటుడు ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూసిన ‘ప్రణీత్’

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
Jio Cloud PC: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Embed widget