Pawan Kalyan Birthday : ఎక్కడ నెగ్గాలో తెలుసు.. ఎక్కడ తగ్గాలో తెలుసు- దటీజ్‌పవన్ కల్యాణ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనంటే ప్రాణాలిచ్చే అభిమాలు లక్షల్లో ఉంటారు. సినిమాలు నచ్చి ప్యాన్ అయిన వారికంటే వ్యక్తిత్వం నచ్చి ట్యూన్ అయిన వారే ఎక్కువ.
Happy Birth Day Pawan Kalyan: వపన్ కల్యాణ్.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఒక సాధారణ పౌరుడిగా, ఫిలాసఫర్‌గా.. తనకంటూ ఒక ప్రత్యేకతతో చరిత్రలో తనకి కొన్ని పేజీలు ఉండేలా చేసుకున్న వ్యక్తి. అన్న ప్రోత్సాహంతో ఎదిగినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపించే వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని మానవాతీత వ్యక్తిగా ఉండటం కంటే ఒక సాధారణ పౌరుడిగా, ఒంటరిగా, చిన్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయదారుడిగా ఉంటూ అప్పుడప్పుడూ పుస్తకాలు చదువుకోవడం ఆయనకి ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు.. మార్పు కోసం అని గట్టిగా చాటిచెప్పిన నాయకుడు పవన్ కల్యాణ్. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం.. వ్యక్తి పూజకు దూరం. అవరసమైతే కుటుంబాన్ని కాదనుకోగలడు.. అన్నకోసం పది మెట్లు దిగి కాళ్ల దగ్గరే ఒదిగిపోగలడు.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నిఖార్సైన మనిషి పవన్. ఆడపిల్లల మీద, మహిళల మీద అలవిమాలిన అభిమానం. వారికంటూ ప్రత్యేక రక్షణ కల్పించాలని నిత్యం లోలోపల జ్వలించేవాడు. తన సినిమా ఫంక్షన్లలో కానీ, జనసేన పార్టీ మీటింగుల్లో కానీ నిత్యం మహిళల రక్షణ గురించే మాట్లాడే స్త్రీ పక్షపాతి పవన్. అందుకే ఆయన స్థాపించిన జనసేన పార్టీలో వీరమహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారికి స్వేచ్ఛ ఉంటుంది. వారికి పవన్ సపోర్టు ఉంటుంది..
చిరంజీవి తమ్ముడిగా మొదలై..
మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఎదిగారు. అయిష్టంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ప్రత్యేకత చాటుకోవడమే కాకుండా ప్రధాన ఆకర్షణగా నిలిచారు పవన్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్న సపోర్ట్ పని చేసినా నిలదొక్కుకోవాలంటే మాత్రం.. కష్టపడాల్సిందే అన్న సూత్రం మొదటిసినిమాకే పవన్ కి అర్థమైంది. డ్యాన్సులు, మార్షల్ ఆర్ట్స్‌తో యూత్‌లో గొప్ప క్రేజ్ తెచ్చుకున్నారు. అదే క్రేజ్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన వయసు 50 ఏళ్లు దాటింది కానీ ఆయనకు ఇప్పటికీ 5 ఏళ్ల వయసున్న ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తీసే ఒక్కో సినిమా ఒక్కో రకం. ఒక సినిమాను మరో సినిమాతో పోల్చిచూడలేం.. ఆయనదో ప్రత్యేకమైన పంథా. పవన్ ఒక ఆల్‌రౌండర్. ఆయన నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, డ్యాన్సర్, సింగర్..ఇలా అన్ని ఫ్రేములపైనా ఆయనకు అవగాహన కూడా ఉంది. హిట్ ప్లాపులతో ఆయన సినిమాలకు సంబందం ఉండదు. పవన్ కల్యాణ్ యూత్‌ను ఆకట్టుకోవడంలో ట్రెండ్ సెట్టర్..
వైవాహిక జీవితం..
తన వైవాహిక జీవితం గురించి స్వయంగా పవన్ కల్యాణ్ ఒక్కోసారి అసంతృప్తి వ్యక్తం చేసేవారు. పెళ్లంటే ఇష్టంలేని తాను మూడు పెళ్లిళ్లు చేసువాల్సి వచ్చిందని ఆవేదన చెందుతూ ఉంటారు. మహిళల జీవితాల గురించి వారి బాగోగుల గురించి మదనపడే పవన్.. తన విషయంలో ఇలా జరగడం పట్ల అప్పుడప్పుడూ మదనపడుతూనే ఉన్నానని అంటుంటారు. కమ్యూనిజం భావజాలం ఉన్న వ్యక్తి పవన్. ఒంటరిగా పుస్తకాలు చదువుకుంటూ ఉండటమే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తుందని, బోర్ కొడితే వ్యవసాయం చేసుకుంటానని చెబుతారు. సముద్రమే ఎదురొచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం ఎదురెళ్లగల దీశాలి పవన్. వ్యక్తిగతంగా ఆయనకు సామాజిక స్పృహ ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఓర్చుకోలేరు. తన ఆస్తిని త్యాగం చేసైనా సాయపడాలని కోరుకునే గొప్ప మనిషి.. అదే ఆయన్నను వయసుతో సంబంధం లేకుండా చాలామందికి దగ్గర చేసింది.
ప్రజారాజ్యం నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా..
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం 2008లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా మొదలైంది. యూత్ వింగ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ పని చేశారు. పార్టీ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వేలమందిని కలిశారు. అన్ని ప్రాంతాలు తిరిగారు. ఆరోజుల్లో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీతోనే కయ్యానికి కాలుదువ్వారు.. తర్వాత కాలంలో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ఇష్టం లేక రాజకీయాలకు దూరమయ్యారు. కేంద్రమంత్రిగా ఉన్న తన అన్న చిరంజీవితోనూ చాలాకాలం పాటు దూరంగా ఉన్నారు. పదవుల కోసం ఆయనెప్పుడూ ఆరాట పడలేదు. పదవులు ఇస్తామని ఆశ చూపినా లొంగిపోలేదు. తాను గెలవడం కాదు, తనను నమ్ముకున్న వారు గెలవాలని పంతం పట్టాడు పవన్.
సరిగ్గా 2014 మార్చిలో ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. అదే పవన్ కల్యామ్.. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కారణంతో 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశారు. ఒకే ఒక్కసీటులో పార్టీ విజయం సాధించింది. పవన్ పోటీ చేసినా రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు. అయినా పవన్ మాత్రం నిరాశ చెందలేదు. మరింతం ఉత్సాహంతో పని చేశారు. పార్టీని నిర్మించుకోవడం ముఖ్యమని ఓట్లు చీలడమే పార్టీ ఓటమికి కారణమని గ్రహించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే టీడీపీతో పోత్తు ఉంటుందని సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఆ మేరకు బీజేపీని కూడా కూటమిలో కలిపి పోటీ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. తాను పోటీ చేసిన పిఠాపురంలోనూ భారీ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.
కూటమి ఏర్పాటులో కీలకపాత్ర
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమి కట్టడంలో పవన్ దే కీలకపాత్ర. బీజేపీని కూటమిలోకి రప్పించడంలో సక్సెస్ అయిన పవన్.. అదే ఊపును కొనసాగించి వైసీపీ ఓటమికి కారకడయ్యారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకులే తీవ్ర నిరాశలో ఉంటే పవన్ మాత్రం ధైర్యం ప్రదర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి జైలుకి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. పార్టీ నాయకులతో ఏ సంప్రదింపులు కూడా లేకుండానే నేరుగా టీడీపీకి మద్ధతు ఇస్తానని చెప్పారు. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని మొదటిసారి ఆయనే ప్రకటించారు. అంతకుముందు పలుమార్లు చంద్రబాబు ఒన్‌సైడ్ లవ్ గురించి మాట్లాడినా పవన్ మాత్రం స్పందించలేదు. కానీ, ఆయన అరెస్ట్ తర్వాత ప్రభుత్వం మీద చాలా ఎగ్రెసివ్ యాటిట్యూడ్ ప్రదర్శించారు.
దూకుడు, మక్కుసూటితనం...
దూకుడుగా వ్యవహరించడం, ముక్కుసూటిగా మాట్లాడటమే పవన్ బలం. ఏ విషయాన్నైనా నాన్చకుండా నిర్మొహమాటంగా సమాధానం చెప్పగలడు. ఇవే ఆయనకు పలు సమస్కలు తెచ్చిపెట్టింది. సన్నిహితులను దూరం చేసింది. అయినా ఆయన కష్టనష్టాలకు ఓర్చాడే కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. తన విధానాలు నచ్చినవారే తనతో ఉంటారని తనను విమర్శించే వారు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంగా చెప్పగలగిన ధైర్యం ఆయన సొంతం. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన పట్టించుకోడు.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ముందుకే సాగుతుంటారు.
Also Read: పుట్టినరోజు వేడుకలకు పవన్ దూరం! వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపు