Anasuya Bharadwaj : శివాజీ Vs అనసూయ - రుణం తీర్చుకుంటానన్న 'మంగపతి'... మీలాంటి వాళ్ల సపోర్ట్ అసలే వద్దన్న 'రంగమ్మత్త'
Sivaji Comments : యాంకర్ అనసూయపై సీనియర్ హీరో శివాజీ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంలోకి అనసూయ గారు ఎందుకు వచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. దీనిపై అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు.

Anasuya Bharadwaj's Reaction On Sivaji Satirical Comments : హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్‌పై నటుడు శివాజీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. 'ఈ బాడీ మీది కాదు మాది' అంటూ పోస్ట్ చేయడమే కాకుండా... శివాజీ అభద్రతా భావంతో ఉన్నారని ఆయన్ను చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. ఈ కామెంట్స్‌పై నటుడు శివాజీ స్పందించారు.
'నీ రుణం తీర్చుకుంటా'
ఈ వివాదంలోకి అసలు అనసూయ ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదన్నారు శివాజీ. 'అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు. నేను ఆమెను ఏమీ అనలేదు. మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె పేరునే కాదు నేను ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. నా ఇన్ సెక్యూరిటీ గురించి అనసూయ గారు మాట్లాడారు. అవునమ్మా. మా హీరోయిన్లను అలా వెళ్లినప్పుడు ఏదైనా జరుగుతుందనే నాకు ఇన్ సెక్యూరిటీ ఉంది. మీరు నా మీద జాలి చూపించారు కదా.
చాలా థాంక్స్. మీకిచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థాంక్స్ చెబుతూ అదే భగవంతున్ని కోరుకుంటున్నాను. తొందర్లోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం నాకు కల్పించాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. ఎవరైనా ఆమెను ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్లాలనేదే నా ఉద్దేశం.' అంటూ చెప్పారు.
Also Read : హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
శివాజీపై ఇప్పటికీ తనకు సింపతీ ఉందని యాంకర్ అనసూయ అన్నారు. 'అతి వినయం దూర్త లక్షణం అని నాకు తెలుసు. నేను షోరూం ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు ఓ జర్నలిస్ట్ నన్ను అడిగారు. అందుకే నేను రియాక్ట్ అయ్యాను. ఈ రోజు ప్రెస్ మీట్‌లో శివాజీ ఓ బాధితుడిలా మాట్లాడారు. ఆయన చేతకానితనంతో మాట్లాడుతున్నారు. ఇన్ సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వారు ఎదుటివారి మీద రుద్దుతుంటారు.
వాళ్లకు కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఈ రోజు కూడా సింపతీ గేదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టే ఆయనపై సింపతీ చూపిస్తున్నా. నేను కూడా హీరోయిన్‌నే. ఈ బట్టలే వేసుకోవాలని ఆయనకు ఎవరూ చెప్పడం లేదు. శివాజీ మాకు చెప్పేంత చిన్నపిల్లలం అయితే మేము కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టంతో మమ్మల్ని ఉండేటట్లుగా చూడాలని ప్రార్థిస్తున్నాం సార్. మీరు నన్ను లాగలేదు. కానీ కలెక్టివ్‌గా లాగారు. నాకు నచ్చిన బట్టలు వేసుకోవాలనుకునే చాలా మంది ఫీమేల్ యాక్టర్స్‌లాగే నేను కూడా ఉన్నా. అందుకే నా ఒపీనియన్ చెప్పాను.' అని తెలిపారు.
View this post on Instagram
'మగాళ్లకు చెప్పండి'
'మీరే చాలా తెలివైన వారు అనుకుంటే... సృష్టికర్తలైన మేము మాకెంత బుర్ర ఉంటుంది అని మీరనుకుంటున్నారు. మీ ప్లేస్ మీకు చూపించాలని మేము కంకణం కట్టుకుంటే మీ పరిస్థితేంటి? మీకే కనుక హీరోయిన్ల భద్రతపై అంత కన్సర్న్ ఉంటే మగవాళ్లకు చెప్పండి. ఏంట్రా అలా చేస్తున్నారు? అమ్మాయిలను గౌరవించండి. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అని ఎక్కడ రాసుంది? బట్టలు మేటరే కాదు. క్యారెక్టరే మేటర్. ఎన్నో సందర్భాలు దాటుకుని ధైర్యంగా ఇక్కడకు వచ్చాను. నాకు మీలాంటి వాళ్ల సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు నాపై కామెంట్స్ చేసిన వారితో పాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా నా లాయర్ నుంచి నోటీసులు వస్తాయి.' అంటూ చెప్పారు.






















