అన్వేషించండి

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైలామాలో ఉన్నారా? 'సలార్ 2', 'డ్రాగన్'లలో ఏది ముందుగా స్టార్ట్ చేస్తారు?

Prashanth Neel: ప్రశాంత్ నీల్ లైనప్ లో 'సలార్ 2', 'డ్రాగన్' వంటి రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రభాస్, ఎన్టీఆర్ లలో ఎవరి చిత్రాన్ని ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

Prashanth Neel: ఇప్పుడు ఉన్నట్టుండి 'సలార్ 2' సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా.. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందనే ఓ న్యూస్ చక్కర్లు కొట్టడమే దీనికి కారణం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆగష్టు 10వ తేదీన ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని, 15 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తో పాటుగా ఎన్టీఆర్ సినిమాని సమాంతరంగా పూర్తి చేస్తారనేది ఈ వార్తల సారాంశం. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' అనే వర్కింగ్ టైటిల్ తో చాన్నాళ్ల క్రితమే ఓ భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. దీనికి 'డ్రాగన్' అనే పేరు ప్రచారంలో ఉంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రతీ ఏడాది హీరో బర్త్ డేకి విషెస్ చెబుతూ ఓ పోస్టర్ వదులుతున్నారే తప్ప, ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. తారక్, నీల్ ల ఇతర కమిట్మెంట్లు కూడా ఈ ఆలస్యానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న 'దేవర' పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తవ్వడం, 'సలార్' తర్వాత ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడంతో ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీని స్టార్ట్ చెయ్యాలని భావించారు. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఇంతలోనే నీల్ ఇద్దరు హీరోల సినిమాలకు ఒకేసారి వర్క్ చేస్తారని టాక్ బయటకు వచ్చింది. 

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందిన 'సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌' సినిమా 2023 డిసెంబర్ లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్ గా 'సలార్ పార్ట్‌ 2 – శౌర్యంగపర్వం' చిత్రాన్ని 2024 మే లేదా జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం అప్పుడెప్పుడో కమిటైన 'డ్రాగన్' ను ముందుకు తీసుకొచ్చారు.. ప్రస్తుతం దాని మీదనే వర్క్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ 'సలార్' సీక్వెల్ షూటింగ్ 20 శాతం పూర్తయింది కాబట్టి, రెండు చిత్రాల షూటింగ్స్ ప్యారలల్ గా ప్లాన్ చేస్తారని ఇప్పుడు బాలీవుడ్ మీడియా చెబుతోంది. 

ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల విషయంలో ప్రశాంత్ నీల్ మీద చాలా ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఎందుకంటే మేకర్స్ 'సలార్ 2' కోసం అలానే ఉంచిన సెట్స్ కు రెంటులు ఎక్కువవుతున్నాయి. అందులోనూ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ చిన్నప్పటి పాత్రలు పోషించిన ఇద్దరు కుర్రాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు. ఇంకా లేట్ అయితే వాళ్లిద్దరూ యంగ్ ఏజ్ స్టేజ్ దాటిపోయే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ కోసం ఒక షెడ్యూల్ చేస్తారని అంటున్నారు. మరోవైపు మైత్రీ మేకర్స్ కూడా నీల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ రెండిటిలో దర్శకుడు ఏది ముందుగా ప్రారంభిస్తారనేది ప్రశ్నర్థకంగా మారింది. 

నిజానికి ప్రభాస్ 'సలార్ 2' తో పాటుగా.. మారుతి 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', హను రాఘవపూడి సినిమాలు కమిటై ఉన్నారు. 'కల్కి 2' షూటింగ్ ఆల్రెడీ 60 శాతం అయిపోయిందని అశ్వినీదత్ చెప్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి, వీఎఫ్ఎక్స్ వర్క్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటి మధ్యలోనే డార్లింగ్ తో 'సలార్ 2' చెయ్యాలి. ఇదంతా చూసుకుంటే ప్రశాంత్ నీల్ వీలుకుదిరినప్పుడు ఒక్కో షెడ్యూల్ చేయడం కంటే, ఒకేసారి సినిమా మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచన చేసే అవకాశముంది. సో ప్రశాంత్ నీల్ వంద శాతం 'డ్రాగన్' మీదనే ఫోకస్ పెట్టి, ప్రభాస్ మూవీ కంటే ఎన్టీఆర్ సినిమానే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారని అనుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Also Read: విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget