అన్వేషించండి

Amardeep Chowdary : ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ - నానికి 'అష్టా చెమ్మా' నాకు 'సుమతీ శతకం'... హీరో అమర్‌దీప్ చౌదరి రిక్వెస్ట్

Amardeep Chowdary Reaction : బిగ్ బాస్ ఫేం అమర్‌దీప్ చౌదరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ మూవీ 'సుమతీ శతకం'. శుక్రవారం సినిమా రిలీజ్ కానుండగా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Amardeep Chowdary Speech In Sumathi Sathakam Pre Release Event : 'జానకి కలగనలేదు' సీరియల్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకుని ఆ తర్వాత రియాలిటీ షోస్, బిగ్ బాస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు అమర్‌దీప్ చౌదరి. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ 'సుమతీ శతకం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

ఒక్క ఛాన్స్ ప్లీజ్...

తాను యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సీరియళ్లు, చిన్న చిన్న సినిమాలతో ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు అమర్‌దీప్. 'నా వెనుక ఏ బ్యాగ్రౌండ్ లేదు. నా కష్టం, టాలెంటే నా గ్రౌండ్. వచ్చిన ప్రతీ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చాను. అలా నాకు వచ్చిన గొప్ప అవకాశం సుమతీ శతకం. నేచరల్ స్టార్ నానికి అష్టా చెమ్మా మూవీతో ఎలాంటి హిట్ అయితే వచ్చిందో అలాగే ఈ మూవీతో నాకు వైబ్ వస్తుందని నమ్ముతున్నా.

ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేనేంటో చూపిస్తా. నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతీ శతకం. నాకు వేరే ఆప్షన్ లేదు. నేను ఈ సినిమాతోనే బయటకు రావాలి. నేను రాత్రికి రాత్రే పెద్ద హీరో అయిపోతాను అని చెప్పను. కానీ ఈ మూవీతో నేను నిలబడగలను అని మాత్రం చెప్తా. నా కంటే మించిన ఆర్టిస్టులు ఉన్నా మా ప్రొడ్యూసర్స్ నన్ను ఎంచుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సుమతీ శతకం అందరికీ నచ్చుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.' అంటూ చెప్పారు.

Also Read : రామ్ చరణ్ 'పెద్ది' ఎఫెక్ట్ - అఖిల్ అక్కినేని 'లెనిన్' వాయిదా పడనుందా?

'రవితేజ నా ఇన్‌స్పిరేషన్'

మాస్ మహారాజ రవితేజ తన ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు అమర్ దీప్. 'నేనేదో పాపులర్ కావడానికి రవితేజ పేరు వాడుకోవడం లేదు. ఆయన నాకు గురువు. ఆయనంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగా. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. దేవున్ని వరం కావాలని మాత్రమే అడుగుతాం. కానీ ఇది కావాలి అని డిమాండ్ చేయం.' అని అన్నారు. 'సుమతీ శతకం' సినిమాలో అన్నీ పాత్రలు హీరోయేనని... అందరూ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.

టికెట్స్ రేట్స్ ఇవే

టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులోనే ఉంటాయని నిర్మాతలు తెలిపారు. మల్టీ ఫ్లెక్సుల్లో 150, సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు ఉంటుందని... సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని... అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పారు.

ఎంఎం నాయుడు దర్శకత్వం వహించిన మూవీలో అమర్ దీప్ సరసన సాయిలీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. బిగ్ బాస్ ఫేం టేస్టీ తేజ కీలకపాత్ర పోషించారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget