Lenin Release Date : రామ్ చరణ్ 'పెద్ది' ఎఫెక్ట్ - అఖిల్ అక్కినేని 'లెనిన్' వాయిదా పడనుందా?
Lenin Movie : రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ వాయిదా పడడంతో మరో మూవీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ సైతం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Akhil Akkineni's Lenin Movie Set To Be Postponed : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్'. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్, సాంగ్ హైప్ క్రియేట్ చేయగా మే 1న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు.
'పెద్ధి' ఎఫెక్ట్... లెనిన్ వాయిదా?
అయితే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ కారణంగా ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా 'లెనిన్' మూవీ వాయిదా వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. త్వరలోనే దీనిపై మూవీ నిర్మాతలు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అటు, నాని 'ది ప్యారడైజ్' కూడా వాయిదా పడుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
Also Read : నారా రోహిత్ విత్ అల్లరి నరేష్ - కామెడీ ఎంటర్టైనర్‌తో మల్టీ స్టారర్స్
ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేం మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా... అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నారు. అంతకు ముందు యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నా అనుకోని కారణాలతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.






















